తెలంగాణ

అమెరికా వ్యవసాయ విధానాలు వర్ధమాన దేశాలకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: అమెరికా ప్రభుత్వ వ్యవసాయ రంగం విధి విధానాలు, కార్యకలాపాలు అభివృద్ధి చెందుతున్న వర్థమాన దేశాలకు స్ఫూర్తి దాయకం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అమెరికా వాషింగ్టన్ డిసి పట్టణంలో మంత్రి శనివారం అమెరికా ప్రభుత్వ వ్యవసాయ శాఖ, అమెరికా విత్తనాల సంస్థ అధికారులతో సమావేశం అయ్యారు. మార్కెట్ ధరలను నియంత్రించేందుకు అమెరికా ప్రభుత్వం రైతులు సాగు చేసే పంటలు, వాటి సమయం, పరిమాణంపై దృష్టి పెడుతోందని అన్నారు. అదే విధంగా రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌లో తక్కువ ధర పలికినట్టు అయితే రైతు నష్టపోతున్న మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. అమెరికాలో పంటల బీమా పథకం ఉందని, ఇదే విధానం మన దేశంలోకూడా ఉందని అన్నారు. అమెరికా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రైతు వివరాలు, సాగు చేసే భూమి వివరాల డేటా బేస్ ఉంటుందని, ఈ విధానం అందరూ ఆచరించదగినదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు విక్రయించేందుకు కావలసిన సహాయాన్ని అందిస్తామని అమెరికా విత్తనాల సంస్థ అధికారులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి బృందానికి హామీ ఇచ్చారు.