తెలంగాణ

ఏ ముఖంతో ఓట్లడుగుతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: తెలంగాణకు గానీ, హైదరాబాద్‌కు గానీ ప్రధాని మోదీ ఒరగబెట్టింది ఏమిలేదనీ, అలాంటప్పుడు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఆ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావుప్రశ్నించారు. తెలంగాణ సంగతి అటుంచి కనీసం హైదరాబాద్ నగరానికి మోదీ ఏం చేశారో చెప్పాలని బిజెపి నేతలను మంత్రి నిలదీశారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిజెపి నాయకులు బంగారు ప్రకాశ్, సామ సుందర్‌రెడ్డి మంత్రి కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు నల్ల ధనాన్ని భారత్‌కు రప్పిస్తానని ప్రగల్బాలు పలికిన మోదీ, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటమరిచి విదేశాల్లో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. నల్లధనాన్ని పక్కన బెడితే ఎప్పుడూ విదేశీ పర్యటనలతో కాలం గడుపుతున్న మోదీని దేశానికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. ప్రధాన మోదీ చేసినవి రెండే రెండు పనులని, అందులో ఒకటి చీపురుకట్ట ఇచ్చి ఎవరి ఇంటిని వాళ్లు ఊడ్చుకోమనడం, రెండోవది ఎవరి బ్యాంక్ ఖాతా వారు తెరుచుకుని డబ్బులు జమ చేసుకోమనడం అని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రధాని మోదీ ఏనాడైన తెలంగాణ ప్రజలకు ముఖం చూపించారా? మరి ఏ ముఖం పెట్టుకుని బిజెపి నేతలు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కష్టాలు కేంద్ర మంత్రి దత్తాత్రేయకు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. గుజరాత్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన మోదీ, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజి ఎందుకు ప్రకటించలేదని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర నాయకులు ప్రధాని మోదీని నిలదీయకుండా, టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి దుయ్యబట్టారు. హైదరాబాద్ ఫ్రజలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారని, అలాంటి వాతవరణాన్ని కలుషితం చేయడానికి బిజెపి, టిడిపిలు కుట్రలు పన్నుతున్నాయని మంత్రి ఆరోపించారు. ప్రాంతం పేరుతో టిడిపి, మతం పేరుతో బిజెపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయని మంత్రి ధ్వజమెత్తారు. బిజెపి మత రాజకీయాలను మానుకోవాలని మంత్రి సూచించారు. మనలో మనం కొట్టుకోవడం లేదని టిడిపి నేతలు తెగ బాధపడిపోతున్నారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి వర్గానికి మేలు చేసిందన్నారు. పేదల పక్షాన నిలువాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ వృద్ధులకు, వికలాంగులకు. వితంతువులకు పెన్షన్లను ప్రవేశపెట్టారని మంత్రి వివరించారు.

గురువారం తెలంగాణ భవన్‌లో బిజెపి నేతలకు టిఆర్‌ఎస్ కండువాలు కప్పి ప్రసంగిస్తున్న తెలంగాణ మంత్రి కెటిఆర్