తెలంగాణ

జాతీయ పక్షిని హతమార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, సెప్టెంబర్ 3: వన్యప్రాణుల వేట రోజురోజుకు పెచ్చుమీరుతోంది. అటవీ జంతువులు, పక్షులపై కనే్నసిన వేటగాళ్లు తరచు వేటాడి విక్రయిస్తున్నారు. శనివారం సాయంత్రం జాతీయ పక్షి నెమలిని చంపి కాలుస్తుండగా ముగ్గురు వ్యక్తులను పట్టుకున్న సంఘటన మెదక్ మండలం తొగిట శివారులోని రామస్వామి ఆలయం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి...మెదక్ మండలం దేవుని కూచన్‌పల్లికి చెందిన ఎరుకల బక్కయ్య, ఎరుకల భూమయ్య, అంతం దుర్గయ్య నెమలిని వేటాడిచంపి కాలుస్తుండగా గమనించిన కొందరు వ్యక్తులు 100కు ఫోన్‌చేసి సమాచారమిచ్చారు. దీంతో మెదక్ రూరల్ ఎస్‌ఐ సంతోష్‌కుమార్ అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మనోజ్‌కు విషయం తెలపడంతో హుటాహుటిన అక్కడికెళ్లి నెమలిని కాలుస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వీరిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదుచేసి, ఆదివారం ఉదయం జడ్జి ముందు హాజరుపరుస్తామని వివరించారు. వీరిని పట్టుకోవడంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్లు ప్రియాంక, ప్రవీణ్, సిబ్బంది ఉన్నారు.
అటవీ జంతువులపై వేటగాళ్ల కన్ను
మెదక్ ప్రాంతంలో అడవి ఉండడం, పోచారం వన్యప్రాణి అభయారణ్యం, జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం ఉండడం వల్ల వేటగాళ్లు అటవీ జంతువులను వేటాడేందుకు ఎప్పుడూ కనే్నసి ఉంచుతారు. జింకలు, నెమళ్లు, ఇతర జంతువులను తరచూ వేటాడం ఇక్కడ పరిపాటిగా మారింది. వన్యప్రాణులను వేటాడేవారిపై ఉక్కుపాదం మోపాలని జంతుప్రేమికులు కోరుతున్నారు. గత నెలలో వెల్దుర్తి మండలంలో జింకలను హతమార్చిన విషయం తెలిసిందే.

చిత్రం..కాలిన నెమలి ఈకలు. నెమలిని చంపి కాల్చిన దుండగులు