తెలంగాణ

60 డివిజన్లపై పేచీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో మిత్రపక్షాలైన తెలుగు దేశం- భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ‘చిచ్చు’ సద్దుమణగలేదు. ఆశావాహుల ఆందోళనలు, నిరసనలతో రెండు పార్టీల కార్యాలయాలు హోరెత్తాయి. గత ఎన్నికల్లో విజయం సాధించిన, బలమైన డివిజన్లను పంపకానికి ఎలా పెడతారంటూ రెండు పార్టీల్లోనూ ఆశావహులు, అనుచరులు నిలదీస్తున్నారు. దీంతో సంఖ్యాపరంగా సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చినా, ఏడే డివిజన్లు ఎవరు తీసుకోవాలన్న అంశంపై రెండు పార్టీల్లో ముఖ్య నేతలకు తలనొప్పిగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఘట్టం ముగుస్తుండగా, పంపకాల విషయంలో శనివారం పొద్దుపోయే వరకూ కూడా రెండు పార్టీల నేతలు చర్చల్లో తలమునకలై ఉన్నారు. నేతలు తేల్చుకోలేక శనివారం బాగా పొద్దుపోయే వరకూ చర్చించారు. అయితే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ‘బి-్ఫరం’ను ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా దాఖలు చేసేందుకు అవకాశం ఉన్నందున నేతలకు కొంత ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. బాగా వత్తిడి ఉన్న ఆశావాహులతో ముందు జాగ్రత్తగా నామినేషన్లు వేయిస్తున్నారు. టిఆర్‌ఎస్‌తో ఆంతరంగికంగా పొత్తు కుదుర్చుకున్న మజ్లీస్ పార్టీ తమ జాబితాను మీడియాకు విడుదల చేయకుండానే, అభ్యర్థులను పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని, నామినేషన్ వేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఎంబిటి ఇప్పటి వరకు 12 మంది అభ్యర్థులను ప్రకటించింది. పండుగ రోజున తొలి జాబితాలుగా అభ్యర్థుల ఎంపికలో వివాదం, ఇబ్బందిలేని డివిజన్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగతా అభ్యర్థుల ఎంపికలో పార్టీల నేతలు తలమునకలయ్యారు. తెలుగుదేశం పార్టీ నేతలు మిత్రపక్షమైన బిజెపి నేతలతో రెండు రోజులుగా జరిపిన చర్చలు కొలిక్కి రావడం లేదు. టిడిపి 90, బిజెపి 60 డివిజన్లలో పోటీ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. కాగా మరో ఐదు స్థానాలు కావాలని బిజెపి పట్టుబట్టడంతో, డివిజన్ల ఎంపిక చేసుకునే సమయంలో మూడు ఇచ్చేందుకు తెదేపా సుముఖత వ్యక్తం చేసింది. కానీ డివిజన్లను ఎంపిక చేసుకోవడమే గగనమైంది. ప్రతి డివిజన్ వద్దకు వచ్చేసరికి ఇది తమకు కావాలంటే, తమకు కావాలని ఇరు పార్టీల నేతలు పట్టుబడుతున్నారు. ఆ డివిజన్ తమకు అనుకూలంగా ఉందని, పైగా బలమైన అభ్యర్థి ఉన్నాడని ఇరు పార్టీల నేతలు గట్టిగా చెప్పడంతో, ఏదీ తేల్చుకోలేకపోతున్నారు. అలా 60 స్థానాల వరకూ పేచీ పడుతున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో తమ పార్టీ 9 నియోజకవర్గాలను కైవసం చేసుకున్నామన్న విషయాన్ని మరిచిపోరాదని తెదేపా వాదిస్తోంది.
బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో ఇరు పార్టీల నేతలు పలు దఫాలు చర్చలు జరిపారు. అనంతరం శనివారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగాల సహాయ మంత్రి సుజనా చౌదరి నివాసంలో చర్చలు చేపట్టారు. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ఆశావాహులు అక్కడికీ చేరుకోవడంతో, వారు అమీర్‌పేటలోని ఆదిత్య హోటల్‌కు మకాం మార్చారు.
అసంతృప్తులు..
గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో కొంతమందికి టిక్కెట్లు ఇవ్వకుండా కొత్తవారిని ఎంపిక చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుండడం, మరికొన్ని డివిజన్లను బిజెపికి కట్టబెట్టారన్న ప్రచారంతో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. టిడిపి ఆశావహులు పలువురు తెదేపా కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌కు చేరుకుని నినాదాలిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు చర్చలు జరుగుతున్న సుజనాచౌదరి నివాసం ముందు ఆందోళనకు దిగారు. గత ఎన్నికల్లో టిడిపి గెలుపొందిన డివిజన్లను బిజెపికి ఎలా కేటాయిస్తారంటూ వారు ఆందోళనకు దిగారు. దీంతో రెండు పార్టీల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సాఫీగా కలిసి పని చేసుకోవాలని, పార్టీల ద్వితీయశ్రేణి నాయకులకు, కిందిస్థాయి కార్యకర్తలకూ ఇదే విధమైన సంకేతం పంపించాలని నేతలు భావించారు.
టి.కాంగ్రెస్ నేతల కసరత్తు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం శనివారం నగరంలోని గోల్కండ హోటల్‌లో జరిగింది. టిఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే ఆ పేర్లను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసుకుని అభ్యర్థులను ప్రకటించాలన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేయగా, ఆదివారంతో నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాబట్టి ఇంకా ప్రకటించకుండా ఉండరాదని, అలస్యం చేస్తే అభ్యర్థుల ప్రచారానికి తగినంత సమయం సరిపోదన్న అభిప్రాయాన్ని మరి కొందరు వ్యక్తం చేశారు.

చిత్రం... సీట్ల సర్దుబాటుపై మిత్రపక్ష చర్చల్లో తెదేపా-్భజపా నేతలు