తెలంగాణ

అర్థమయ్యేలా రీడిజైన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: నీటిపారుదల ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గోదావరి నదిలో తెలంగాణకున్న వాటామేరకు నీటిని సమర్ధంగా, సంపూర్ణంగా వాడుకోవడానికి అనుగుణంగానే ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేశామన్నారు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌తో ఒనగూరే ప్రయోజనాలపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించేలా నివేదికలు ఉండాలన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం నీటిపారుదలరంగ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, వ్యాప్కోస్ మేనేజింగ్ డైరెక్టర్ శంభు ఆజాద్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ రంగారెడ్డి తదితరులతో ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరిపారు. గోదావరి, కృష్ణా నదులపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు వెంటనే టెండర్లు ఆహ్వానించడంతో పాటు ఇప్పటికే పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల పనులు ఏకకాలంలో జరగాలన్నారు. సమైఖ్య పాలనలో తెలంగాణ ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రాజెక్టులు ముందుకు వెళ్లకూడదన్న దురుద్దేశంతో తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు డిజైన్ చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని వ్యాప్కోస్ సంస్థ ప్రతిపాదించలేదని, అది ప్రభుత్వ నిర్ణయం మాత్రమేనని సిఎం అన్నారు. గోదావరి ప్రధాన నదిపైకాకుండా, ఉప నది అయిన ప్రాణహితపై ప్రాజెక్టు నిర్మించాలనుకోవడం ఆశ్చర్యకరమైన విషయమని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణలో ప్రాజెక్టులకు ఎందుకు రీ-డిజైనింగ్ చేయాల్సి వచ్చిందో? కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపడుతున్నాం, తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఏవిధంగా నిర్మించబోయేది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ వల్ల లాభమేమిటి? దేవాదుల ప్రాజెక్టును ఎలా ఉపయుక్తంగా మార్చబోయేది? ఎల్లంపల్లి ప్రాజెక్టును ఏవిధంగా వినియోగించుకునేది ప్రజలకు అర్థమయ్యేలా నివేదిక ఉండాలన్నారు. అలాగే సర్వే పనులను ప్రభుత్వరంగ సంస్థ వ్యాప్కోస్‌కు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందో ప్రజలకు తెలియాలన్నారు. మేడిగడ్డ వద్ద నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని గుర్తు చేశారు. ఆ రాష్ట్ర సిఎంతో అక్కడి కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపట్ల ఆసక్తిగా ఉన్నారన్నారు. ఉద్యమ సమయంలో తాను కూడా కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తామని మొక్కుకున్నట్టు సిఎం తెలిపారు. త్వరలోలే మొక్కు చెల్లించి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్నారు. గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లవద్ద నిర్మించే బ్యారేజీలకు వెంటనే టెండర్లు పిలవాలన్నారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాణహితపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టును రద్దుచేసే ఆలోచన లేదన్నారు. అయితే ప్రాజెక్టును బహుళార్థకంగా మార్చడమే లక్ష్యమన్నారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాణహితపై బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. దీనికి సంబంధించిన బ్యారేజీ, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం కోసం వ్యాప్కోస్ ద్వారా సర్వే నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. ఇక కృష్ణాపై నిర్మించబోయే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించబోయే రిజర్వాయర్ల పనులు రెండేళ్లలో పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాల్లో పురోగతిలో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలను వేగవంతంగా పూర్తిచేసి ఖరీఫ్‌కు నీళ్లందించాని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.25 వేల కోట్లు కేటాయించడంతోపాటు ఇతర పథకాల ద్వారా మరో రూ.5 వేల కోట్లు వీటికి సమకూరబోతున్నాయని వివరించారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల ఏకీకరణ పనులను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఖరారు చేశారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ రెండింటిని కలపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్లపాడు, బయ్యారం రిజర్వాయర్ల ద్వారా ఖమ్మం జిల్లాలో కొత్తగా ఐదు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సిఎం సూచించారు.

చిత్రం... సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్