తెలంగాణ

వ్యవసాయమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, వ్యవసాయానికి నిరంతరాయంగా పది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వ్యవసాయ రంగంలో సేవలు అందించిన 51 మంది రైతులు, అధికారులు, వ్యవసాయ శాస్తవ్రేత్తలకు రైతు నేస్తం పురస్కారాలు అందజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించి చూపిస్తామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు ఏటా 25వేల కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని, అవసరం అయితే అంత కన్నా ఎక్కువ ఖర్చు చేయడానికి సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా తెలంగాణ రైతుల కలలు నిజం చేస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్దాల కాలం అనే అభిప్రాయం ఉందని, దానిని తుడిచి వేస్తూ అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా రీ డిజైనింగ్ చేసినట్టు చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని 46వేల చెరువులను పునరుద్ధరించినట్టు చెప్పారు. మొదటి దశ మిషన్ కాకతీయ పూర్తయిందని, చెరువులు నీటితో నిండాయని చెప్పారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో 44 మార్కెట్ యార్డుల్లో జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని అమలు చేసినట్టు హరీశ్‌రావు తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయ పార్టీలన్నీ రైతుల సమస్యలు పరిష్కరించడానికి కలిసి కట్టుగా కృషి చేయాలని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దిగుబడులు పెంచాలని అన్నారు. రైతులకు సరైన సమాచారం అందించి వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు తెలియజేయడానికి ప్రభుత్వం కిసాన్ చానల్ ప్రారంభించిందని చెప్పారు. ప్రైవేటు చానల్స్ 24 గంటల పాటు ఇతర వార్తలకే ప్రాధాన్యత ఇవ్వకుండా కొంత సమయం వ్యవసాయానికి కేటాయించాలని అన్నారు. 2019 నాటికి 65వేల నివాస ప్రాంతాలకు రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 19వేల కోట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించినట్టు చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేర్చడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ పూర్తిగా తగ్గిపోయిందని, యూరియా కొరత లేదని చెప్పారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు మెరుగైన బీమా పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగంలో కృషి చేసినందుకు రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీకి జీవన సాఫల్య పురస్కారాన్ని, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డికి విశిష్ట పురస్కారాన్ని వెంకయ్యనాయుడు అందజేశారు.

రైతు నేస్తం పురస్కారాల కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు జ్ఞాపికను అందజేస్తున్న టి.మంత్రి హరీశ్‌రావు. కాంగ్రెస్ నేత కోదండరెడ్డికి పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న దృశ్యం