తెలంగాణ

కొత్త జిల్లాకు రూ. కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: కొత్త జిల్లాకు కోటి రూపాయలు, పాత జిల్లాలకు రూ. పాతిక లక్షలు చొప్పున మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం మొత్తం 19కోట్ల 25లక్షలు మంజూరు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పది జిల్లాలు ఉండగా, హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలను విభజిస్తూ మొత్తం 27 జిల్లాలను చేస్తున్నారు. వీటిలో పదిహేడు కొత్త జిల్లాలు. కొత్త జిల్లాల ఏర్పాటుకు తక్షణ అవసరం కోసం జిల్లాకు కోటి రూపాయల చొప్పున 26కోట్ల రూపాయలు విడుదల చేస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం హైదరాబాద్ మినహా మిగిలిన 26 జిల్లాలకు 26కోట్లు అవసరం అని భావించి, 26 కోట్లు మంజూరు చేశారు. అయితే పది పాత జిల్లాలే ఉన్నాయి, వీటికి కొత్తగా వ్యయం ఉండదు. కానీ కొత్తగా ఏర్పడే జిల్లాలకే ఎక్కువ నిధులు అవసరం అవుతాయి. ఆ తేడాను గమనించకుండా ప్రతి జిల్లాకు కోటి కేటాయించారు. అప్పటి వరకు ఉనికిలో ఉన్న జిల్లాకు కోటి రూపాయలే, కొత్తగా ఏర్పడే జిల్లాకు కోటి రూపాయలే కేటాయిస్తూ ఈనెల ఏడవ తేదీన జివో జారీ చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడుతున్నందున ప్రతి జిల్లాకు కోటి రూపాయలు మంజూరు చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరించి తాజాగా మరో జీవో జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ప్రస్తుతం ఉన్న జిల్లాలకు 25లక్షల రూపాయలు, కొత్త జిల్లాలకు కోటి రూపాయలు కేటాయించారు. మొత్తం 19 కోట్ల 25లక్షల మంజూరు చేశారు. పాత జిల్లా నుంచి కొత్త జిల్లాలు ఏర్పడుతున్నప్పుడు సమావేశాల నిర్వహణ, ఫైళ్లు తీసుకు వెళ్లడం, ఫర్నీచర్ తదితర ఖర్చులకు పాతిక లక్షలు కేటాయించారు. ఇక కొత్త జిల్లాల్లో ఫర్నీచర్, కంప్యూటర్లు, తదితర వాటిలో తక్షణ అవసరం కోసం జిల్లాకు కోటి కేటాయించారు. పాత జిల్లాకు కొత్తగా ఏర్పడే జిల్లాకు అవసరాలు వేరువేరుగా ఉంటాయని గ్రహించకుండా జివో విడుదల చేయడం విశేషం. ఈ జివో ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాకు రెండు కోట్ల 25లక్షలు కేటాయించారు. కొత్తగా ఏర్పడుతున్న రెండు జిల్లాలకు రెండు కోట్లు, మహబూబ్‌నగర్‌కు పాతిక లక్షలు కేటాయించారు. రంగారెడ్డి జిల్లాకు 2.25కోట్లు, నల్లగొండ 2.25కోట్లు, వరంగల్‌కు అత్యధికంగా మూడు కోట్ల 25లక్షలు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు కోటి 25లక్షల చొప్పున, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు 2.25 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశారు.