తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టి బావిలో పడ్డ ట్రాక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురుమామిడి, సెప్టెంబర్ 17: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లింగాల దుద్దెనపల్లి వద్ద శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో జరిగిన ఘెర రోడ్డు ప్రమాదంలో చిగురుమామిడి మండలం బోమ్మనపల్లి గ్రామానికి చెందిన కొంకట శ్రీకాంత్ (26), పిల్లి సంతోష్ (25), బొల్లి రాజు (23), మాచమల్ల రఘు (22) అనే యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.
ఒకే గ్రామానికి చెందిన వీరంతా మృతి చెందడంతో బొమ్మనపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలతో సంఘటన స్థలం మిన్నంటింది. ఘటనను చూసేందుకు దాదాపు వేలాది జనం సమీప గ్రామాల నుంచి తరలివచ్చారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం జమ్మికుంటలో పర్యటించిన నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం వెళ్లిన కోహెడ ఎఎస్‌ఐ రాజేందర్‌తో పాటు మరొక కానిస్టేబుల్ ఎపి 15 బిబి 3142 అనే నెంబరు గల బైక్‌పై వెళ్లివస్తుండగా, వీరి వెనుకాల వస్తున్న యువకులు ప్రయాణిస్తున్న కొత్త ట్రాక్టర్, ఎఎస్‌ఐ బైక్‌ను వెనుకనుంచి ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్ అదుపుతప్పి దూసుకెళుతున్న సమయంలో ఓనర్ శివ ట్రాక్టర్ పైనుంచి దూకినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎఎస్‌ఐ రాజేందర్, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ట్రాక్టర్ ఇంజన్‌పై కూర్చున్న యువకులు, ట్రాక్టర్‌తో సహా బావిలో పడ్డారు. ఇంజన్ పెద్దది కావడంతో ట్రాక్టర్ ఇంజన్ మీద పడి, ఇంజన్ కింద బావిలో కూరుకుపోయి నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న కోహెడ, సైదాపూర్ ఎస్‌ఐలు తిరుపతి, శ్రీ్ధర్‌లు గాయపడ్డ కోహెడ ఎఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం హుస్నాబాద్ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు. గాయపడ్డ పోలీసులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. ఇక బావిలో పడిన ట్రాక్టర్, యువకులు మృతి చెందిన విషయాన్ని ధృవీకరించిన గ్రామస్థులు, పోలీసులు, రెవెన్యూ, విపత్తు నివారణ ఫైర్ సర్వీస్ అధికారులు, చిగురుమామిడి, సైదాపూర్ జడ్పీటిసిలు, ఎంపిపి, ఇరు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు కసరత్తు చేశారు. శనివారం ఉదయం 6 గంటలకు క్రేన్‌ను తెప్పించి రెస్క్యూ టీం ప్రయత్నాలు ప్రారంభించగా పిల్లి సంతోష్ మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా మృతదేహాలు ట్రాక్టర్ కింద నలిగిపోయి ఉండడంతో, అధికారులు తెప్పించిన క్రేన్‌తో పని కాకపోవడంతో మరో భారీ క్రేన్‌ను తెప్పించారు. రెండు క్రేన్‌ల సహాయంతో సుమారు 10 గంటల పాటు తీవ్రంగా శ్రమించి ముందుగా ట్రాక్టర్‌ను, అనంతరం మాచమల్ల రఘు, కొంకట శ్రీకాంత్, బొల్లి రాజుల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న మంత్రి ఈటెల రాజేందర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ మృతుల కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చా రు. కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, కరీంనగర్, హుజురాబాద్ డిఎస్పీలు జె.రామారావు, చల్లూరి రవీందర్‌రెడ్డి సంఘటన స్థలి వద్ద అక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 8 మంది ఎస్‌ఐలు, 200 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

క్రేన్ సాయంతో మృతదేహాలను బావిలోంచి వెలికితీస్తున్న దృశ్యం..
ఘటన స్థలం వద్ద మిన్నంటిన మృతుల బంధువుల రోదనలు.