తెలంగాణ

తెలంగాణ విద్యా పాలనపై 23 నుండి జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణ విద్యా పరిపాలన ప్రణాళిక అనే అంశంపై నీపా ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి రెండు రోజుల పాటు జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సును ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభిస్తారు. సదస్సు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్‌డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సిఇఆర్‌టి అధికారులు, డిఇఓలు, ఎంఇఓలు, టిఇఐ ప్రిన్సిపాల్స్ హాజరవుతారని అన్నారు.
ఎమ్సెట్ -3 సర్ట్ఫికేట్ల
పరిశీలనకు 7002 మంది
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎమ్సెట్-3లో అర్హులైన అభ్యర్ధులతో మెడికల్, డెంటల్ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న వెబ్ ఆప్షన్లలో సోమవారం సాయంత్రం వరకూ 7002 మంది హాజరయ్యారు. 4501 నుండి 9వేల ర్యాంకు వరకూ పిలవగా జనరల్ కేటగిరిలో 2536 మంది సోమవారం నాడు హాజరయ్యారు. స్పెషల్ కేటగిరిలో 145 మంది హాజరయ్యారు. 20వ తేదీన వెబ్ ఆప్షన్లు ఉదయం ఆరు గంటలకు ప్రారంభం అవుతాయి. 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ ఉంటుంది. 21వ తేదీ ఐదు గంటల తర్వాత వెబ్ ఆప్షన్లు కొనసాగించే ప్రసక్తే లేదని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ విసి డాక్టర్ కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.