తెలంగాణ

విద్యారంగ సమస్యలపై మహాధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణలో హాస్టళ్లలో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ సోమవారం నిర్వహించిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లను పెంచాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, హాస్టళ్లలో వౌలిక సదుపాయాలు కల్పించాలని , పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్ , ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ నేతలు హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై ఇందిరాపార్కు నుండి సెక్రటేరియట్ వరకూ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై ఇందిరాపార్కు నుండి సెక్రటేరియట్ వరకూ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
సెక్రటేరియట్ ముందు న్యాయంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపు చేసేందుకు పిడిగుద్దులు గుద్దారని లాఠీఛార్జీ చేశారని విద్యార్ధులు ఆరోపించారు. మధ్యలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రావడంతో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకుందామని వెళ్లినా కారులో నుండి దిగకుండానే వెళ్లిపోయారు. విద్యార్థులు మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేయడంతో కొంత మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. అమ్మాయిలను సైతం ఈడ్చుకుంటూ లాక్కెళ్లి అరెస్టు చేసి 500 మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు బనాయించారని రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ పేర్కొన్నారు. ఇందిపార్కు వద్ద జరిగిన సభలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్నది ఎంఎల్‌ఎలు, కెసిఆర్ కోసం కాదని, సామాన్య విద్యార్థుల కోసమని అన్నారు. విద్యార్థులందరూ ఉద్యమించి, విద్యారంగ సమస్యలను సాధించాలని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి బి సాంబశివ, ఉపాధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, ఆంజనేయులు, జగదీష్, డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.