తెలంగాణ

పంట నష్టాలను సేకరించి పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ జిల్లాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, రబీ పంటలకు ఏర్పాట్లపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. వర్షాల వల్ల పంటలకు మంచి జరిగిందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. ఎక్కడైనా భారీ వర్షాల వల్ల పంటలకు నష్టం జరిగి ఉంటే వివరాలు సేకరించి తనకు పంపించాలని ఆయన ఆదేశించారు. వివిధ పంటల పరిస్థితి గురించి అధికారులతో ఆయన ఆరా తీశారు. పంట కోతకు రాగానే రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇలా ఉండగా రబీకి కూడా ఏర్పాట్లు చేయాలని కోరారు. రైతులకు అవసరమైన విత్తనాలను వారికి అందుబాటులో ఉంచాలని సూచించారు.