తెలంగాణ

వైద్యశాఖలో అలర్ట్ ప్రకటించిన మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున వైద్యశాఖ ఉద్యోగులు, డాక్టర్లు, సిబ్బంది సెలవులు తీసుకోవద్దని చెప్పారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సెలవులు వద్దని తెలిపారు. ఆదివారాలు కూడా వైద్య సేవకు అందుబాటులో ఉండాలని చెప్పారు. అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్న చోట ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అదే విధంగా జిల్లాల్లో వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.