తెలంగాణ

పెరుగుతున్న సాగర్ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 25: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన గత రెండురోజులుగా శ్రీశైలం నుండి నీటిరాక ప్రారంభం కావడంతో సాగర్ జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోది. నిన్నమొన్నటివరకు సాగర్ జలాశయ నీటిమట్టం 513 అడుగులు ఉండగా ఆదివారం సాయంత్రానికి 516 అడుగులకు పెరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, ఉపనదులు ద్వారా ఎగువ కృష్ణానదిలో భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉండడంతో సాగర్ జలాశయ నీటిమట్టం పెరిగే పరిస్థితిపై ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను రెండురోజులుగా భారీగా చేరుతున్న వరద ప్రవాహంతో ఆదివారం సాయంత్రానికి 880 అడుగులకు దాటింది. దీంతో శ్రీశైలానికి ఆదివారం ఉదయం నుండి వస్తున్న నీరు పెరుగుతూ వస్తోంది. మధ్యాహ్నం వరకు 2 లక్షల క్యూసెక్కుల లోపు ఉన్న నీటి ప్రవాహం సాయంత్రానికి 2.50 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 73,623 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయానికి వదులుతున్నారు. ఆదివారం ఉదయం వరకు కూడా 50 వేల నుండి 60 వేల క్యూసెక్కుల వరకు విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు విడుదల చేసిన శ్రీశైలం డ్యాం అధికారులు శ్రీశైలానికి ఎగువ నుండి వస్తున్న వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఎంత మొత్తం అధికంగా వదలాలో అంత నీటి పరిమాణాన్ని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 2.50 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటున్న కారణంగా నేడోరేపో శ్రీశైలం డ్యాం క్రస్ట్‌గేట్లను ఎత్తి సాగర్‌కు నీటివిడుదల చేసే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుండి వస్తున్న నీరే కాకుండా చుట్టుపక్కల చెరువులు, ఉపనదుల నుండి భారీగా వరదనీరు వచ్చి చేరుకుంటుంది. దీంతో శ్రీశైలం డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు. జూరాలకు ఎగువ నుండి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా సుమారు 2.25 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఎగవ భాగాన ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయికి చేరడంతో వచ్చే నీరంతా సాగర్‌కు చేరుకోనున్నందున నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.