తెలంగాణ

కనిష్టస్థాయికి పడిపోయిన యాదాద్రి ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 27: నల్లగొండ జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్థానం ఆదాయం ఎన్నడూ లేనంతగా మంగళవారం కనిష్టస్థాయికి పడిపోయింది. గత కొంతకాలంగా తగ్గు ముఖం పడుతూ వస్తున్న ఆదాయం మంగళవారం మరింత తగ్గింది. మంగళవారం యాదాద్రిలో వివిద విభాగాల నుండి 2 లక్షల 66 వేల 240 రూపాయల ఆదాయం సమకూరింది. బాలాలయంలో దర్శనాలు ప్రారంభమై సుమారు 6 మాసాలు కావస్తోంది. ప్రధానాలయం అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు కూల్చివేతలు కొనసాగుతుండడం, కొండపైన వసతి గదులు కూల్చివేయడం భక్తులకు సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం, ముఖ్యంగా అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగడం, కొండపైన ఇప్పటివరకు దక్షిణ దిశలో రిటైనింగ్‌వాల్ నిర్మాణం పునాది దశలోనే పను లు కొనసాగుతుండడం గమనార్హం. ఇప్పటివరకు కనీసం దక్షిణదిశలో నృసింహ్మకాంప్లెక్స్ కూల్చివేసిన ప్రాంతంలో మాత్ర మే రక్షణగోడ నిర్మాణ పనులు కొనసాగుతుండగా దక్షిణ దిశలో మిగతా 80 శాతం రక్షణ గోడ నిర్మాణపు పనులు కనీసం బేస్‌మెట్ లెవల్ నిర్మాణానికి కూడా నోచుకోలేదు. ప్రస్తుత తరుణంలో యాదాద్రి అభివృద్ధిలో రిటైనింగ్ వాల్ నిర్మాణం కీలకం. రిటైనింగ్ వాల్ నిర్మాణం ఎంత త్వరితగతిన పూర్తయితే అభివృద్ధి పనులు అంత వేగం పుంజుకునేందుకు వీలుపడుతుంది.