తెలంగాణ

ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుతామని రాష్ట్ర పర్యాటక మంత్రి ఎం. చందూలాల్ తెలిపారు. బతుకమ్మ సంబురాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను, కార్యక్రమాలను సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన వివరించారు. ఈ నెల 30 నుండి అక్టోబర్ 9 వరకు పదిరోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు పాతజిల్లాల్లో ఒక్కో జిల్లాకు 10 లక్షల రూపాయలు, కొత్తగా ఏర్పడే జిల్లా ఒక్కోదానికి ఐదులక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. అక్టోబర్ ఎనిమిదిన ఎల్‌బి స్టేడియంలో 10 వేల మంది మహిళలతో వలయాకారంగా ‘మహాబతుకమ్మ పండగ’ నిర్వహిస్తున్నామన్నారు. అలాగే అక్టోబర్ తొమ్మిదోతేదీన ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మలో వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారన్నారు. జిల్లాల్లో కూడా బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కేవలం తెలంగాణకు చెందిన మహిళలే కాకుండా, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన మహిళలు కూడా పాల్గొంటున్నారన్నారు.
అక్టోబర్ 7 నుండి 11 వరకు బ్రహ్మకుమారీ విశ్వవిద్యాలయం నేతృత్వంలో కల్చరల్ ఫెస్టివల్, బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయని మంత్రి చందూలాల్ తెలిపారు.
ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్
ఈ నెల 29 నుండి పదిరోజుల పాటు ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని మంత్రి చందూలాల్ తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండో పర్యాయం నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో 36 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 300 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొంటారని, 41 ప్రింట్ ఎగ్జిబిషన్లు, 20 డిజిటల్ ఎగ్జిబిషన్లు, 18 ఆర్టిస్ట్స్ టాక్స్, రెండు పుస్తకాల విడుదల ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాలు స్టేట్ ఆఫ్ ఆర్ట్‌గ్యాలరీ, జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలను ఎంపిక చేశామన్నారు. మరో 14 ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఫోటోగ్రఫీ ఫెస్టివల్ జరుగుతుందని వెల్లడించారు. బతుకమ్మతో పాటు ఫోటోగ్రఫీ ఫెస్టివల్ కు చెందిన బ్రోచర్లు, సిడిలు, నిర్వహణ షెడ్యూల్‌ను మంత్రి ఆవిష్కరించారు.