తెలంగాణ

ఎత్తిపోతల ద్వారా 2.34 లక్షల ఎకరాలకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: చిన్న తరహా ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఏడాది 2 లక్షల 34 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడిసి) అధికారులను ఆ శాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆదేశించారు. ఐడిసి కార్యాలయంలో బుధవారం అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. టిఎస్‌పి పథకం కింద కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రూ. 18 కోట్ల వ్యయంతో చేపట్టిన 55 ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఐడిసి కింద లక్ష 56 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా మరో 78 వేల ఎకరాలు కలిపి వచ్చే రబీ సీజన్ నవంబర్ వరకు మొత్తంగా రెండు లక్షల 34 ఎకరాలకు సాగునీరు అందించాలని మంత్రి సూచించారు. రాష్టవ్య్రాప్తంగా 176 ఎత్తిపోతల పథకాల మరమ్మత్తుల కోసం రూ. 50 కోట్లు విడుదల చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. కొత్తగా చేపట్టిన 39 ఎత్తిపోతల పథకాలు, మరమ్మత్తులు జరుగుతున్న 40 ఎత్తిపోతల పథకాల కింద 65 ఎకరాలు సాగులోకి రానున్నాయని మంత్రి వివరించారు.

నరుూం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

గ్యాంగ్‌స్టర్‌తో సంబంధం ఉన్నవారిపై చర్యలు
ఓ మాజీ అదనపు ఎస్పీకి
సంబంధాలున్నట్టు గుర్తించిన సిట్
ప్రజాప్రతినిధులకు భద్రత కుదింపు
రివాల్వర్ల లైసెన్స్‌లు రద్దు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 28: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నరుూంతో సంబంధాలున్న వారిపై సిట్ అధికారులు చర్యలు చేపట్టారు. గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలున్న పోలీస్ అధికారుల సర్వీసు రివాల్వర్లను స్వాధీనం చేసుకుంటోంది. రాజకీయ నాయకుల భద్రతను కుదిస్తోంది. వారికిచ్చిన రివాల్వర్ లైసెన్సులను రద్దు చేస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది మంది పోలీస్ అధికారులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు పోలీస్ శాఖలో సుమారు 30 మంది అధికారులు నరుూంతో అంటకాగినట్టు సిట్ గుర్తించింది. వారిలో 8మంది సర్వీసు రివాల్వర్లు సరెండర్ చేయాల్సిందిగా సిట్ అదేశించింది. వీరిలో ఎస్సైలు, సిఐలు, డిఎస్పీలు, ఏఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉన్నట్టు సమాచారం. అధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే కొందరు తమ ఆయుధాలను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఓ రిటైర్డ్ అదనపు ఎస్పీని నాలుగు రోజులుగా సిట్ ప్రశ్నిస్తోంది. అదేవిధంగా రేపు మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకొని విచారించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. నరుూంతో సంబంధాలు కలిగివున్న ప్రజాప్రతినిధులకు 2 ప్లస్ 2, అంతకంటే ఎక్కువ భద్రత ఉన్నవారికి 1ప్లస్ 1కు తగ్గించారు. కొందరికి గన్ లైసెన్స్‌లు రద్దు చేస్తూ ఆయుధాలు ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లా టిఆర్‌ఎస్‌కు చెందిన దుబ్బాక నర్సింహారెడ్డి ఆయుధ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. మాజీ మావోయిస్టు సాంబశివుడి తమ్ముడి కోనపురి రాములును చంపేందుకు నరుూంకు దుబ్బాక నర్సింహారెడ్డి సహకరించాడని ఆరోపణలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా మద్దెల చెరువు సూరి హత్య కేసులో అతనిపై కేసు ఉంది. ఆ కేసులో 8వ ముద్దాయిగా దుబ్బాక ఉన్నట్టు సిట్ అధికారులు తెలిపారు.
నాకు కాదు.. కోమటిరెడ్డికి సంబంధాలు
గ్యాంగ్‌స్టర్ నరుూంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, తన గన్ లైసెన్స్ రద్దుకు, నరుూం కేసుకు అసలు సంబధమే లేదని టిఆర్‌ఎస్ నేత దుబ్బాక నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోనపురి రాములు హత్యతో తనకు సంబంధం లేదని, నిజంగా తన పాత్ర ఉంటే ఎఫ్‌ఐఆర్‌లో తన పేరుండేదని తెలిపారు. రాములు తనకు ప్రాణస్నేహితుడని దుబ్బాక అన్నారు. నరుూంతో కలసి తన హత్యకు కోమటిరెడ్డి కుట్రపన్నారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని గన్ లైసెన్స్ తీసుకున్నట్టు చెప్పారు. నరుూంతో కోమటిరెడ్డికి సంబంధాలున్నాయని, గత ఎన్నికల్లో కోమటిరెడ్డికి నరుూం సహకరించాడని ఆయన వెల్లడించారు. 2009లో నరుూంకు కోమటిరెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కారు కొనిచ్చారని, ఈ మొత్తం పరిణామాలతో కోమటిరెడ్డి తగిన మూల్యం చెల్లించకుంటారని దుబ్బాక హెచ్చరించారు.