తెలంగాణ

వేగంగా ‘పాలమూరు’ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29:పాలమూరు ప్రాజెక్టును ముందుగా అనుకున్నట్టుగా సకాలంలో పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. పాలమూరు ప్రాజెక్టుపై మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూ వస్తోంది. ఇది కొత్త ప్రాజెక్టు అని ఆంధ్ర వాదించగా, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టే అని తెలంగాణ వాదించింది. పాత ప్రాజెక్టే అని అపెక్స్ కౌన్సిల్‌లో ఆధారాలు చూపించారు. ఆ సమావేశం అనంతరం పాలమూరు ప్రాజెక్టుపై జరిగిన తొలి సమావేశంలో పనుల్లో వేగం పెంచాలని అధికారులకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 26,756 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో 12,779 ఎకరాలను సేకరించినట్టు ప్రాజెక్టు సిఇ లింగరాజు తెలిపారు. 42229.09 ఎకరాల ప్రభుత్వ భూమి, 8504.77 ఎకరాల పట్టా భూమిని సేకరించారు. మరో 14,022.77 ఎకరాల భూమి సేకరించాలి. ఈ భూమి సేకరణ ముమ్మరం చేయాలని మంత్రి ఆదేశించారు. 18 ప్యాకేజీల్లో ఇప్పటి వరకు జరిగిన పనులు, తలెత్తిన సమస్యలపై మంత్రి అధికారులను అడిగారు. కొన్ని ప్యాకేజీలకు సంబంధించిన సర్వే పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇద్దరు అధికారులను డిప్యుటేషన్‌పై తెలంగాణకు రప్పించే చర్యలు తీసుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషిని మంత్రి కోరారు. భూసేకరణ అంశంలో ఉదాసీనత పనికిరాదని సూచించారు. భూ సేకరణలో స్థానిక ప్రజాప్రతినిధుల సహాయం తీసుకోవాలని అన్నారు. సమస్య జఠిలంగా ఉన్న చోట సంబంధిత ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి, వారి సహకారంతో సమస్య పరిష్కరించుకోవాలని చెప్పారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. భూ సేకరణ పనులు వేగంగా పూర్తి చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పారు.

చిత్రం.. పాలమూరు ప్రాజెక్టుపై గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు