తెలంగాణ

జిల్లాల పునర్విభజనపై స్టేకు హైకోర్టు నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్విభజన ప్రక్రియపై స్టే ఇవ్వడానికి హైకోర్టు మరోసారి నిరాకరించింది. తమ వద్ద ఉన్న పెండింగ్ కేసు విచారణ తదుపరి కోర్టు వెలువరించే ఉత్తర్వులకు లోబడి జిల్లాల పునర్విభజన ఉంటుందని కోర్టు పేర్కొంది. గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్ జి పద్మావతి మరికొంత మంది పునర్విభజనపై జారీ చేసిన జీవో 366ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి విచారించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల పట్టణం మహబూబ్‌నగర్ కంటే పెద్ద పట్టణమని, 1.5 లక్షల జనాభా ఉందని, గద్వాలను జిల్లా చేయాలని చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. అనంతరం హైకోర్టు ఈ అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ, పిటిషన్ విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.