తెలంగాణ

4,533 చెరువుల్లో చేప పిల్లల పెంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: రాష్టవ్య్రాప్తంగా ఉన్న 4,533 చెరువులలో 35 కోట్ల చేపపిల్లలను పెంచాలని ము ఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
దీనికిగాను రూ.48 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపల పెంపకంపై ముఖ్యమంత్రి చర్చించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ చెరువులన్నీ జలకళను సంతరించుకున్న నేపథ్యంలో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి అన్నారు. చెరువులలో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని అక్టోబర్ 3వ తేదీ నుంచి రాష్టవ్య్రాప్తంగా చేపట్టాలని మంత్రి తలసానిని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ పల్లెలు మరింతగా స్వయంసమృద్ధి సాధించి బంగారు తెలంగాణకు బాటలు వేసే దిశగా చేపల పెంపకం సాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
చేపల వృత్తిదారులు, చేపల పెంపకం దారుల సొసైటీలలోని సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేపల పెంపకాన్ని పల్లెల్లో ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో మొక్కుబడిగా చేపల పెంపకాన్ని చేపట్టడం వల్ల అది మత్స్యకారులను ఏమాత్రం ఆదుకోలేకపోయిందని ముఖ్యమంత్రి అన్నారు.మత్స్యకారులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విధంగా చెరువులలో చేపల పెంపకాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా అక్టోబర్ 3 నుంచి చేపట్టనున్న చెరువులలో చేపపిల్లలను వదిలే కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చేప పిల్లల కొనుగోలు, పంపిణీలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించినట్టు మంత్రి తలసాని ముఖ్యమంత్రికి వివరించారు.