తెలంగాణ

యుఎఇలో బతుకమ్మ పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, సెప్టెంబర్ 30: బతుకమ్మ వేడుకలకు ప్రపంచ ఖ్యాతి తీసుకువచ్చే కార్యక్రమంలో భాగం గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బతుకమ్మ పండుగ నిర్వహించారు. ఉమ్ ఆల్ క్వయిన్‌లో అక్కడి తెలుగు మహిళలతో కలిసి ఎంపి కవిత రంగురంగుల పూల తో బతుకమ్మను అలంకరించి, ఆడి పాడి వైభవంగా పండుగ జరుపుకున్నారు. మహిళలు తమ వెంట తెచ్చుకున్న నువ్వులు, బి య్యంపిండి, నూకలు కలిపిన నైవేద్యాన్ని గౌరీదేవికి ప్రతిరూపమైన బతుకమ్మలకు సమర్పించారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ ఎంబసి సాంస్కృతిక విభాగం ఇంచార్జ్ దీపాజైన్, తెలంగాణ జాగృతి అరబ్ ఎమిరేట్స్ శాఖ అధ్యక్షుడు కిరణ్ పాల్గొన్నారు.

చిత్రం.. యుఎఇలో బతుకమ్మ పూజ చేస్తున్న ఎంపి కవిత