తెలంగాణ

కల్వర్టు పైనుండి వేలాడిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్నూర్, అక్టోబర్ 1: సంగారెడ్డి-నాందేడ్-అకోలా (ఎస్‌ఎన్‌ఎ) రహదారిపై నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం పెద్దఎక్లారా సమీపంలోని ఓ లారీ అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న సంఘటనతో ఎస్‌ఎన్‌ఎ రహదారిపై 15 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల పొడుగున వందలాది వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. మహారాష్టల్రోని నాందేడ్ నుండి హైదరాబాద్‌కు కోళ్ల దాణా లోడ్‌తో వెళ్తున్న లారీ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పెద్దఎక్లారా సమీపంలో అదుపు తప్పి కల్వర్టును ఢీకొని దాని ముందు క్యాబిన్ భాగం గాలిలో వేలాడుతూ రోడ్డుకు పూర్తి అడ్డంగా వేలాడుతూ నిల్చుండిపోయింది. అదృష్టవశాత్తు కల్వర్టు పైభాగంలోనే లారీ నిలిచిపోవడంతో డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడగలిగారు. లేనిపక్షంలో సుమారు 20 అడుగుల లోతు ఉన్న రోడ్డు దిగువ గుంతలో, ప్రస్తుతం మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద జలాల్లో లారీ పడిపోయి ఉండేది. లారీ పూర్తిగా రోడ్డుకు అడ్డంగా ఆగిపోవడం, దానిని పక్కకు తొలగించేందుకు వీలు లేని విధంగా ప్రమాదకర స్థితిలో వేలాడుతూ ఉండడంతో శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం మధ్యాహ్నం వరకు ఈ అంతరాష్ట్ర రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కూడా సహాయక చర్యలకు ఆటంకాలు కలిగించాయి. ఎస్‌ఐ కాశీనాథ్ తన సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు జెసిబిలను తెప్పించి ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం సమయంలో కల్వర్టు పైనుండి వేలాడుతున్న లారీని పక్కకు తొలగింపజేసి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. నా లుగు నెలల క్రితం కూడా ఇదే కల్వర్టు వద్ద అప్పట్లోనూ ఓ లారీ ఇలాగే ప్రమాదానికి గురైంది.

చిత్రం.. మద్నూర్ మండలం పెద్దఎక్లారా సమీపంలోని కల్వర్టు పైన గాలిలో వేలాడుతున్న లారీ ముందు భాగం