తెలంగాణ

రేపటి నుంచి చేపపిల్లల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ రాష్ట్రంలోని జలాశయాల్లో పెంచేందుకు 34.63 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. మత్స్యశాఖ సహకార సంఘాలు, అధికారులతో శనివారం సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. చేపపిల్లలను జలాశయాల్లో పెంచడం వల్ల మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. మత్స్యకారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 48 కోట్ల రూపాయల వ్యయంతో ఉచితంగా 34.63 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ నెల 3 నుండి 15 వరకు ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందని, తాను స్వయంగా జిల్లాల్లో జరిగే చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నానని వెల్లడించారు. రాష్ట్రంలో ఎనిమిది పెద్ద రిజర్వాయర్లు, 17 మధ్యతరహా రిజర్వాయర్లు, 53 చిన్నతరహా రిజర్వాయర్లు, 35,031 చెరువులు ఉన్నాయన్నారు. వీటిలో ఎంపిక చేసిన 4553 జలాశయాల్లో చేపపిల్లల పెంపకం చేపట్టాలని నిర్ణయించామన్నారు. అలాగే గ్రామ పంచాయితీల ఆధీనంలో ఉన్న 19 వేల జలాశయాల్లో 6.86 కోట్ల చేపపిల్లలను ఉచితంగా వదిలివేస్తున్నామని, ఇందుకోసం 10.29 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఈ పర్యాయం బడ్జెట్‌లో మత్స్యరంగం అభివృద్ధికి 101 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఫెడరేషన్లు, సొసైటీలు, మత్స్యకార్మిక సంఘాలు ప్రత్యక్షంగా పాలుపంచుకుని, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. మత్స్యపరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చేపపిల్లల పెంపకానికి సొసైటీలే టెండర్లలో పాల్గొనేలా ఎదగాలని పేర్కొన్నారు. చేపల మార్కెటింగ్‌కోసం జిల్లా, పట్టణ ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. గాంధీ జయంతి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కృత్రిమ గర్భధారణ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.