తెలంగాణ

పోలీస్ స్టేషన్లు కాదు.. వర్శిటీలు పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: సమాజంలో పోలీస్ స్టేషన్లు కాదు విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మానవ సంపద గల దేశమే ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అని అన్నారు. ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశే్వశ్వరయ్య భవన్‌లో ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ విద్యార్థులు దేశ భావి సంపద అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని విశ్వవిద్యాలయాల గురించి, తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడం గురించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని శాసన సభలో నిలదీశామని అన్నారు. తెలంగాణ వచ్చాక విద్య కోసం బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రారంభించామని, 250 ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించినట్టు చెప్పారు. కాస్ట్ అకౌంట్స్‌లో విద్యార్థులు కేవలం మార్కులు సాధిస్తే సరిపోదని, మంచి నైపుణ్యం ఉంటేనే రాణిస్తారని అన్నారు. అత్యంత ప్రతిభా వంతుడైన విద్యార్థిగా తిరుపతిని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభినందించారు.