తెలంగాణ

రెవెన్యూ డివిజన్‌గా కల్వకుర్తిని ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, అక్టోబర్ 1: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కల్వకుర్తి అఖిలపక్ష జెఎసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అఖిలపక్ష నేతలు ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఎడ్మ కిష్టారెడ్డి శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతో కడ్తాల్, చారకొండ, వెల్‌జల్‌లను మండలాలు చేస్తూ వాటన్నింటికీ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇది అన్ని వర్గాల ప్రజల కోరిక అని తెలిపారు. ఇందు కోసం కుల, మత, పార్టీలకతీతంగా తామంతా ఉద్యమిస్తున్నామని, పలుమార్లు ప్రభుత్వ అధికారులను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.
కల్వకుర్తి కేంద్రానికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలాలను అక్కడి ప్రజల అభీష్టానికి విరుద్ధంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ జిల్లాలో కలపడం వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. అన్ని అర్హతలు ఉన్న కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వంశీచంద్ రెడ్డి హెచ్చరించారు.