తెలంగాణ

రేషన్ వినియోగదారులు 60 శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఇచ్చే సబ్సిడీ బియ్యంను రేషన్ షాపుల్లో కేవలం 60 శాతం మంది మాత్రమే తీసుకుంటున్నారు. సబ్సిడీ బియ్యం పథకం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నా, బియ్యం మాత్రం తీసుకోవడం లేదు. తెల్లకార్డు కోసం డిమాండ్ విపరీతంగా ఉంది, అదే సమయంలో బియ్యం మాత్రం తీసుకోవడం లేదు. పౌర సరఫరాల శాఖ పరిశీలనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆదాయం ఎక్కువగా ఉందని పెద్ద సంఖ్యలో కార్డులు రద్దు చేశారు.
అయితే రద్దయిన కార్డులకు సంబంధించి సరైన ఆధారాలు చూపిస్తే పునరుద్ధరించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ప్రధానంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కోసమే తెల్ల రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగినట్టు పౌరసరఫరాల శాఖ పరిశీలనలో వెల్లడయింది. ప్రతి నెలా 25 శాతం నుండి 30శాతం వరకు బియ్యం మిగులు ఉంటోంది. కేవలం 60 నుండి 70 శాతం మాత్రమే బియ్యం తీసుకుంటున్నారు. అనర్హులు కార్డు పొందారని ఇటీవల వేలాది కార్డులు రద్దు చేశారు. ఈ కార్డులను రద్దు చేసిన తరువాత కూడా 30 శాతం వరకు సబ్సిడీ బియ్యం మిగిలే ఉంటున్నాయి. బియ్యం తీసుకోని కార్డులను అనర్హుల వద్ద ఉన్న కార్డులుగా గుర్తించారు. అయితే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసమే ఈ కార్డులను ఉపయోగిస్తున్నట్టు తేలింది. వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఉద్యోగుల వివరాలు, ఆరోగ్యశ్రీ నుండి పెన్షనర్ల వివరాలు ఆధార్‌తో సహా తీసుకుని రేషన్ కార్డు డాటాతో పోల్చి చూసి, ప్రభుత్వ ఉద్యోగుల కార్డులను తొలగించారు.
రాష్ట్ర ప్రభుత్వ సమీకృత పౌర సమాచార నిధి ద్వారా విద్యుత్ శాఖ మున్సిపల్, రవాణా శాఖ నుండి వివరాలు తీసుకొని వాటిని ఆహార భద్రత కార్డు డాటాతో పరిశీలన చేసి నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు, 200 గజాల స్థలంలో సొంత ఇల్లు ఉండి, ఆస్తి పన్ను చెల్లించిన వారు, వెయ్యి కన్నా ఎక్కువ విద్యుత్ చార్జీలు చెల్లించిన వారు, ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు రేషన్ తీసుకోని వారి వివరాలను ఆధార్‌తో పరిశీలించి వారి కార్డులను తొలగించారు. కొంత మంది కార్డు దారులు తాము కారు అమ్మేశామని, లోన్ ద్వారా తీసుకున్నామని, ఆస్తి పన్ను ఓనర్ కడుతున్నారని, తాము వేరే గ్రామానికి వెళ్లడం వల్ల రేషన్ తీసుకోలేదని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో కార్డుల నిలిపివేత ప్రక్రియ నిలిపివేయాలని పౌర సరఫరాల శాఖ కమీషనర్ సివి ఆనంద్ ఆదేశించారు.
ఆహార భద్రతా జాబితా నుండి తొలగించిన అర్హుల కార్డులను తిరిగి పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. ఆటోలు, ట్యాక్సీలు నడిపించే వారివి, 50 నుంచి 70 గజాల ఇల్లు ఉండి జిహెచ్‌ఎంసికి పన్నులు చెల్లించే వారి కార్డులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. తొలగించిన కార్డుల్లో ఇప్పటి వరకు 3,800 కార్డులను పునరుద్ధరించినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. మార్చి 2016 నుంచి ఈ పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ జరుగుతోంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి 9.51లక్షల మందికి కార్డులు పంపిణీ చేశారు.