తెలంగాణ

పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, అక్టోబర్ 2: భారత్‌తో పెట్టుకుంటే పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మెదక్ జిల్లా వర్గల్‌లోని సుప్రసిద్ధ శ్రీ విద్యాధరి క్షేత్రాన్ని ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ ప్రపంచ దేశాల్లో ఏకాకి కానుండగా, భారత్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా కాశ్మీర్ ఎన్నటికీ భారత్‌దేనని, పాకిస్తాన్‌తో జరిగిన ఒప్పందాలన్నింటిపై కేంద్రం పునఃసమీక్షిస్తుందని ఆయన అన్నారు. అలాగే కేంద్రం చేపడుతున్న పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుండగా, ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన స్వచ్ఛ్భారత్‌కు వర్గల్ క్షేత్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తుండగా, ఆలయ చైర్మన్ యాయవరం చంద్రశేఖరశర్మ నేతృత్వంలో శ్రీ విద్యాధరి ఆలయం దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం కేంద్ర మంత్రి దత్తాత్రేయ, గురుమదనానంద పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతితీర్థ ఆశీస్సులు పొందారు.

చిత్రం.. వర్గల్‌లోని సుప్రసిద్ధ శ్రీ విద్యాధరి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ