తెలంగాణ

ప్రాజెక్టులకు వరద పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, అక్టోబర్ 2: రెండు మూడు రోజుల నుండి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా వరదనీరు వచ్చిచేరుతుండడంతో ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్దదైన కడెం జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి 20 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుండడంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు ఉండగా పూర్తిస్థాయి సామర్థ్యం నీరు చేరడంతో నీటిపారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా అప్రమత్తమై ప్రాజెక్టు 7, 8, 9 వరదగేట్లను పది అడుగుల మేర ఎత్తి దాదాపు 38వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. జలాశయం సామర్థ్యం 698 అడుగులు కాగా పూర్తిస్థాయికి చేరుకోవడంతో మెయింటనెన్స్‌ను 700 అడుగులకు చేశారు. కాగా, ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకేసారి 20 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరడంతో ముందు జాగ్రత్తగా మూడు వరదగేట్లను ఎత్తి 38 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం ఇదే తొలిసారని ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్ విలేఖరులకు తెలిపారు. ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్, డిఈ నూరొద్దీన్, ఏఈ శ్రీనివాస్ తమ సిబ్బందితో మకాం వేసి అక్కడే ఉండి ఎప్పటికప్పుడు నీటిమట్టంపై సమీక్షిస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో..
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మరోసారి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, నిజాంసాగర్, లెండి, మంజీరాతో పాటు మహారాష్టల్రోని ఆమేడ్,్ర విష్ణుపురి, ఆదిలాబాద్ జిల్లా గడ్డెన్నవాగు మిగులు జలాలు తోడు కావడంతో రిజర్వాయర్‌లోకి 2లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 1091.00అడుగులు 90టిఎంసిల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను ఆదివారం సాయంత్రానికి 1090.10అడుగులు 85టిఎంసిల వద్ద నిల్వ ఉంచుతూ, రిజర్వాయర్‌కు చెందిన 42వరద గేట్ల ద్వారా 3లక్షల 3వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అదే విధంగా రిజర్వాయర్ ప్రధాన కాల్వలైన కాకతీయ ద్వారా 5వేలు, సరస్వతి కాల్వకు 1000, లక్ష్మి కాల్వకు 200, వరదకాల్వకు 17వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఇదేరోజున రిజర్వాయర్ నీటిమట్టం 1053.50అడుగులు 7.92టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా, ప్రాజెక్టు దిగువన గల జల విద్యుత్ కేంద్రంలో కాకతీయ కాల్వకు నీటి విడుదల జరుగుతుండటంతో 4 టర్బయిన్ల ద్వారా 36మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని జెన్‌కో అధికారులు తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్ట్..
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి భారీగా వరదనీరు రావడంతో ఆదివారం ప్రాజెక్ట్ 19 వరద గేట్లను ఎత్తి 68వేల 992 క్యూసెక్‌ల నీటిని దిగువన మంజీరా నదిలోనికి విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ డిఇఇ సురేష్‌బాబు తెలిపారు. ప్రాజెక్ట్ జలాశయంలోనికి 69 వేల క్యూసెక్‌ల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా 1403.25 అడుగుల నీరు నిల్వఉంచుతూ, అదనంగా వస్తున్న నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నామని డిఇఇ తెలిపారు. పాఠశాలలకు దసరా సెలవులు రావడంతో పర్యాటకులు కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలోప్రాజెక్ట్‌నుతిలకించేందుకు వచ్చి కట్టపై సందడి చేశారు.

చిత్రం.. కడెం జలాశయం