తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపిదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పని చేస్తే 2019 ఎన్నికల్లో తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో లాల్ బహదూర్ శాస్ర్తీ, మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి ప్రసంగిస్తూ మహాత్మా గాంధీ అహింసావాదంతో బ్రిటీష్ వారిని జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. గాంధీ స్పూర్తితోనే ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సంక్షేమం కోసం డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. టి.టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో నాడు ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారని చెప్పారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని వివరించారు.
ఇంకా ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి ఇ. పెద్ది రెడ్డి, ఇతర నాయకులు సాయిబాబా, బిఎన్ రెడ్డి, తాజుద్దీన్, మేకల సారంగపాణి, ప్రకాశ్ రెడ్డి, నిమ్మగడ్డ సీతారత్న కుమారి చౌదరి, ప్రదీప్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

నియంతలా కెసిఆర్!
ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణలో రాజరికం నడుస్తున్నదని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియంతలా పాలిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. రాజకీయాల ద్వారా మరింత సేవలందించవచ్చన్న భావనతో వైద్య విద్యను వదిలి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న తానే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసేందుకు అవకాశం లభించడం లేదంటే తెలంగాణలో ఎలాంటి రాజరిక పాలన కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కల్వకుర్తి ప్రజల ఆకాంక్షల మేరకు కల్వకుర్తిని డివిజన్ చేయాలని కోరాలనుకుంటే ఇంత వరకు అప్పాయింట్‌మెంట్ లభించలేదని ఆయన తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు జిల్లాల పునర్ విభజన చేయాలని ముఖ్యమంత్రి భావించినప్పుడు ప్రతిపక్షాల అభిప్రాయాలనూ తెలుసుకోవాలని ఎందుకు అనుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గ పునర్ విభజన టిఆర్‌ఎస్ నాయకులకు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం (3న) ఇందిరా పార్కు వద్ద ఒక రోజు దీక్ష చేయనున్నట్లు వంశీచంద్ రెడ్డి తెలిపారు.