తెలంగాణ

జనగామ జిల్లా చేయండి.. మాట నిలబెట్టుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: జనగామ జిల్లాగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఎన్నికలకు ముందు చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండి ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా చేయాలని పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మాటలకు విలువ ఇవ్వాలని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. జనగామ జిల్లా కావాలన్నది ప్రజల ఆకాంక్ష అని ఆయన చెప్పారు. జిల్లాల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల వారీగా టిఆర్‌ఎస్ నాయకులతో మంతనాలు జరపడం ప్రారంభించారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే సోమవారం వరంగల్ జిల్లా నాయకులతో కూడా సమావేశం కానున్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జనగామ జిల్లా ఏర్పాటుకు తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. జనగామ ప్రాంతాన్ని జిల్లాగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్క నియోజకవర్గాన్ని నాలుగు జిల్లాలలో కలిపితే శాస్ర్తియంగా, సాంకేతికంగా పరిపాలనాపరంగా ఉపయోగం కాదని ఆయన చెప్పారు. జనగామ ప్రజలు రోజుల తరబడి నిరాహార దీక్షలు చేస్తున్నారని, పాదయాత్రలు, మంత్రులకు వినతి పత్రాల అందజేత, బంద్ వంటి ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని పొన్నాల విమర్శించారు.