తెలంగాణ

‘మిస్టర్ తెలంగాణ’ రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 4: రాష్టస్థ్రాయి ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన సి.రాహుల్ కైవసం చేసుకొని మిస్టర్ తెలంగాణ-2016గా నిలిచారు. సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో ఇండియన్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్టవ్య్రాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 300 మంది బాడీబిల్డర్లు హాజరయ్యారు. 55, 60, 65, 70, 75, 80, 85, 90, 100 కిలోల విభాగంలో ఒక్కో విభాగం నుంచి ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేసి చివరగా 10 మంది విజేతలకు పోటీలను నిర్వహించారు. వారందరిలో 75 కేజీల విభాగంలో గెలుపొందిన రాహుల్‌ను మిస్టర్ తెలంగాణ-2016గా న్యాయనిర్ణేతలు ప్రకటించారు. ఎంపికైన రాహుల్ జాతీయస్థాయి బాడీబిల్డింగ్‌లో తెలంగాణ రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహించనున్నారు. గత ఏడాది జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చి జూనియర్ మిస్టర్ ఇండియాగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి తీన్మార్ వార్తల ఫేమ్ బత్తిరి సత్తి హాజరై సందడి చేశారు. కండలవీరులను, బత్తిరి సత్తిని తలకించేందుకు పట్టణ ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బాడీబిల్డర్స్ ఫెడరేషన్ సెక్రటరీ మోహన్‌రావు, చీఫ్ జడ్జి కృష్ణస్వామియాదవ్, నాగరాజు, మల్లేష్, ఏసప్ప, జిల్లా అధ్యక్షుడు మేదారి ప్రసాద్, సభ్యులు బండ్ల రమేష్, కర్నాటి శ్రీనివాస్, మేడి సాగర్, టిఆర్‌ఎస్ నాయకుడు గండూరి ప్రకాశ్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

చిత్రం.. మిస్టర్ తెలంగాణ-2016 అవార్డును అందుకుంటున్న రాహుల్