తెలంగాణ

నేడు కెసిఆర్‌కు ‘జిల్లాల’ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణలో ముసాయిదాలో ప్రకటించిన 17 జిల్లాలకు అదనంగా తాజాగా ప్రకటించిన నాలుగు జిల్లాలపై రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ బుధవారం కూడా కసరత్తు చేసింది. రెండు రోజులుగా కేశవరావు నివాసంలో కొనసాగుతున్న కసరత్తులో కొత్తగా ప్రకటించిన గద్వాల, ఆసిఫాబాద్, జనగామ జిల్లాల పరిధి, వీటిలో చేర్చాల్సిన మండలాలపైనే హైపవర్ కమిటీ దృష్టి కేంద్రీకరించింది. పై నాలుగు జిల్లాలకు సంబంధించిన పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కేశవరావును కలిసి వినతి పత్రాలు సమర్పించారు.
కేవలం పై నాలుగు జిల్లాలపైనే నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించడంతో వాటిని మాత్రమే పరిశీలిస్తున్నామని కేశవరావు తెలిపారు. ఈ నాలుగు జిల్లాలతో సంబంధం లేని వినతులను ముఖ్యమంత్రికి నివేదిస్తామన్నారు. ఇలా ఉండగా గద్వాల, ఆసిఫాబాద్, జనగామ మూడు జిల్లాలపై హైపవర్ కమిటీ చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఏడవ తేదీ సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వడానికి కమిటీకి గడువు ఇచ్చినప్పటికీ గడువుకు ముందే 6వ తేదీన (గురువారం) సాయంత్రానికి నివేదిక ఇచ్చే దిశగా ప్రయత్నిస్తున్నట్టు కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. ఈ నెల 7వ తేదీన కొత్త జిల్లా ఏర్పాటుపై మంత్రిమండలి సమావేశం జరుగనుండటంతో ఒక రోజు ముందుగానే నివేదికను తయారు చేస్తున్నట్టు తెలిపారు.
కమిటీ ప్రాథమికంగా తయారు చేసిన కసరత్తులో గద్వాల జిల్లాలో గద్వాల నియోజకవర్గంలోని ఐదు మండలాలు, అలంపురం నియోజకవర్గంలోని ఐదు మండలాలు, కొత్తగా ఏర్పాటు చేయబోయే నందినె్న మండలం మొత్తంగా 11 మండలాలు కలపాలని సిఫారసు చేసినట్టు తెలిసింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మంచిర్యాల నియోజకవర్గంలోని రెండు మండలాలు మొత్తంగా 16 మండలాలు కలపాలని కమిటీ సిఫారసు చేసినట్టు తెలిసింది.
జనగామ జిల్లాలో జనగామ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు మొత్తంగా 13 మండలాలు కలపాలని కమిటీ సిఫారసు చేసినట్టు సమాచారం. కల్వకుర్తి రెవిన్యూ డివిజన్ సాధన అఖిల పక్ష నేతలు బుధవారం ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ కమిటీని కలిసి కల్వకుర్తి, వెల్దండ, వంగూరు, చారకొండ, ఉర్కొండపేట మండలాలతో కల్వకుర్తి డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కల్వకుర్తి డివిజన్ ఏర్పాటు పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ఉండటంతో పై మండలాలతో డివిజన్ ఏర్పాటుకు కేశవరావు సానుకూలంగా స్పందించినట్టు అఖిల పక్ష నేతలు తెలిపారు.