తెలంగాణ

టాటా భాగస్వామ్యంతో డబుల్ బెడ్‌రూంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మిస్తోన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తి ఆసక్తి చూపించారు. ఐటి మంత్రి కె తారక రామామారావు సోమవారం ముంబయిలో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్ర్తిని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలను కలిసి తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు. తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకుగల అవకాశాలను వివరించారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరించారు. టాటా గ్రూపు ఇప్పటికే నగరంలో డిఫెన్స్, ఏరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్టు కెటిఆర్ తెలిపారు. తెలంగాణకు టాటా బ్రాండ్ అంబాసిడర్స్ అని సిఎం గతంలో అన్న మాటలను కెటిఆర్ మిస్ర్తికి గుర్తు చేశారు. ఐటి పరిశ్రమ, పారిశ్రామికరంగంతో పాటు హౌసింగ్ రంగంలో పెట్టుబడులపై మిస్ర్తితో కెటిఆర్ చర్చించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకంలో భాగస్వామ్యానికి టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తి అంగీకారం తెలిపారు. టాటా హౌసింగ్ ప్రాజెక్టు తరఫున కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటామని సైరస్ మంత్రి కెటిఆర్‌కు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో టాటా-ఏఐజి టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు మిస్ర్తి తెలిపారు. ఇక టి-హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌కు సహకారం అందించేందుకు టాటా గ్రూప్ అంగీకరించింది. అనంతరం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో కెటిఆర్ సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, విద్యుత్ ప్రణాళికలను మంత్రి అంబానీకి వివరించారు. ప్రతి పథకానికి ఒక డెడ్‌లైన్ విధించి ముందుకెళ్తున్నట్టు చెప్పారు. వాటర్ గ్రిడ్‌ను పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగేది లేదని సిఎం చేసిన ప్రకటనను గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పక్కా విజన్‌తో ముందుకెళ్తోందని, దానికి తగిన ఆచరణ కనిపిస్తోందని అంబానీ అన్నారు. కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రణాళికలు, ఆచరణను అంబానీ అభినందించారు. ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తమవద్ద ప్రణాళికలు ఉన్నాయన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో పెద్దఎత్తున వివిధ రంగాల్లో కలిసి పని చేస్తామన్నారు. కెటిఆర్ ముంబయి పర్యటనలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెంట ఉన్నారు.

చిత్రం... ముంబయి పర్యటనలో
టాటా గ్రూప్స్ సిఇవో మిస్ర్తీతో మంత్రి కెటిఆర్