తెలంగాణ

పెట్టుబడుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఫార్మా కంపెనీలన్నింటినీ ఒకేచోట స్థాపించడానికి వీలుగా ఫార్మా సిటీ నెలకొల్పుతున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఒకేచోట ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయడం వల్ల కాలుష్య సమస్యను అధిగమించవచ్చన్నారు. అలాగే ఫార్మాసిటీతోపాటు ఫార్మా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా చైర్మన్ ఫ్రెడ్రిక్ ఫౌల్‌సెన్, కంపెనీ ఇండియా ప్రతినిధి డాక్టర్ అశోక్ తదితరులు క్యాంపు కార్యాలయంలో సోమవారం సిఎంతో సమావేశమయ్యారు.
తమ కంపెనీ తెలంగాణలో 100నుంచి 250 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఫార్మా కంపెనీకి ప్లాంట్లతోపాటు మరో 9 ఆర్ అండ్ డి యూనిట్లు వివిధ దేశాల్లో ఉన్నాయని వివరించారు. తమకు ఇండియాలోని మహారాష్టల్రో రెండు యూనిట్లు ఉన్నాయని, తాజాగా తెలంగాణలో ఒక యూనిట్ స్థాపనకు సుముఖంగా ఉన్నట్టు ఫ్రెడ్రిక్ సిఎంకు తెలిపారు. తమ రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం (టిఎస్- ఐపాస్) తర్వాత 83 కంపెనీలు తెలంగాణలో స్థాపించడానికి ముందుకురాగా, వాటిని ఆమోదించినట్టు సిఎం వివరించారు. కొత్త పారిశ్రామిక విధానంలో కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు సిఎం వివరించారు. దేశంలో బల్క్ డ్రగ్స్ కంపెనీలు చేసే ఉత్పత్తుల్లో 3వ వంతు ఉత్పత్తులు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయన్నారు. దీంతో హైదరాబాద్‌లో బల్క్ డ్రగ్స్‌వల్ల కాలుష్య సమస్య తలెత్తకుండా ఫార్మా సిటీ స్థాపనకు పూనుకున్నామని సిఎం తెలిపారు. ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉన్న యూరోపియన్, అమెరికా దేశాల్లో కాలుష్య నియంత్రణ కోసం అనుసరిస్తున్న విధానాల అధ్యయనానికి తమ ప్రభుత్వం ఒక బృందాన్ని పంపనున్నట్టు చెప్పారు. తమ కంపెనీ ఉత్పత్తుల వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తమ కంపెనీలోనే ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నెలకొల్పుతున్నట్టు ఫెర్రింగ్ ఫార్మా సిఎండి ఫ్రెడ్రిక్ వివరించారు. ఈ సందర్భంగా టిఎస్- ఐపాస్ విధాన పత్రాలను సిఎం వారికి అందించారు.

చిత్రం... సిఎం కెసిఆర్‌తో సమావేశమైన ఫెర్రింగ్ ఫార్మా సిఎండి ఫెడ్రిక్