తెలంగాణ

వీసీ నియామకాలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకాలకు బ్రేక్ పడింది. ఒకవేళ ప్రభుత్వం విసిలను నియమించే పక్షంలో కోర్టు తీర్పునకు లోబడి మాత్రమే చేయాల్సి ఉంటుందని రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది. ఎపి యూనివర్శిటీల చట్టానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన మార్పులను సవాలు చేస్తూ ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన మాజీ ప్రొఫెసర్ డాక్టర్ డి మనోహర్‌రావు దాఖలు చేసిన ప్రజావాజ్య పిటీషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటీషన్‌ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన బెంచ్ గవర్నర్‌కు ఉన్న ఛాన్సలర్ అధికారాలను ప్రభుత్వమే తీసుకోవడం ఎమిటని ప్రభుత్వాన్ని నిలదీసింది. 2015 సెప్టెంబర్ 11న రాష్ట్రప్రభుత్వం ఒక జీవో ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న జీవోను అమలుచేసిన తర్వాత దానిని సవరిస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ తరఫున ఎస్ శ్రీరాం వాదించారు.
యుజిసి నియమ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రప్రభుత్వం పరిపాలకులను సైతం విసిలుగా నియమించేలా చట్టసవరణలు చేసిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాలకు విసి పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తూ డిసెంబర్ 20న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని ఆయన న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 2014 పునర్విభజన చట్టాన్ని దత్తత తీసుకున్న తర్వాత దానిని పదే పదే సవరించే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం పేర్కొంది.
ఇటీవల జిహెచ్‌ఎంసి విషయంలోనూ ప్రభుత్వం జీవో చెల్లదని న్యాయస్థానం పేర్కొనగానే ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయాన్ని న్యాయమూర్తులు ప్రస్తావించారు. ఫిబ్రవరి 23న తుది తీర్పు వస్తుందని, అంతలోగా నియామకాలు చేపడితే అది తుది తీర్పునకు లోబడి మాత్రమే ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ఫుటా పిటీషన్
కాగా తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్సు అసోసియేషన్స్ సైతం మరో పిటీషన్‌ను హైకోర్టులో దాఖలు చేసింది. కేంద్ర- రాష్ట్ర చట్టాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలు ప్రస్తావిస్తూ విసిల నియామకంపై టిఎస్ ఫుటా ఈ పిటీషన్ దాఖలు చేసింది.
ఫీజులను నియంత్రించండి
హైదరాబాద్‌లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అత్యధికంగా ఫీజులు వసూలుచేయాడాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్‌ను ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ ఎస్ వి భట్‌లతో కూడిన బెంచ్ పిటీషన్‌ను స్వీకరించింది. అత్యధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్లను పార్టీగా ఎందుకు చేర్చలేదని పిటీషనర్లను కోర్టు ప్రశ్నించింది. దానికి బదులుగా ఆరు స్కూళ్లను చేర్చడం జరిగిందని చెప్పగా, మిగిలిన స్కూళ్లను కూడా చేర్చాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వానికి గడువు ఇచ్చింది.