తెలంగాణ

మళ్లీ పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై న్యాయశాఖ లోతుగా అధ్యయనం చేస్తోందని తెలిసింది. 2014 డిసెంబర్ 29న ప్రభుత్వం ఒక జీఓ (జీఓ నెంబర్ 173) జారీ చేస్తూ, ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. డి.వినయ్ భాస్కర్, జలగం వెంకటరావు, వి. శ్రీనివాస్‌గౌడ్, జి.కిశోర్‌కుమార్, వి.సతీశ్ కుమార్, కోవా లక్ష్మిలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. వీరికి సహాయ మంత్రి హోదా కల్పించారు. అయితే వీరి నియామకానికి సంబంధించిన జీఓను సవాల్ చేస్తూ పార్లమెంట్ సభ్యుడు జి.సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన జీఓను మాత్రమే కొట్టివేస్తున్నామని, ఇందుకు సంబంధించిన చట్టాన్ని కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. దాంతో చట్టపరంగా ఉన్న లొసుగులను గుర్తించి, తిరిగి నియామకంపై ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించారని తెలిసింది.
ఎలాంటి ఇక్కట్లూ లేవని తేలితే మళ్లీ పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి మోక్షం లభిస్తుందని తెలుస్తోంది.