తెలంగాణ

ఫ్రెండ్లీ పోలీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు చేరువైందని, తెలంగాణ చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర హోంమంత్రి నాయిని నార్సింహరెడ్డి అన్నారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థను చేరువ చేసేందుకు ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు చేపట్టిందని, పోలీస్ సంక్షేమం, వ్యవస్థ ఆధునికీకరణకు వచ్చే బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయింపునకు నిశ్చయించిందని అన్నారు. శుక్రవారం గోషామహల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో అమరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో అసువులుబాసిన అమరులకు నివాళి అర్పించారు. రాష్ట్రంలో, దేశంలో ఎలాంటి విపత్తు వచ్చిన ముందుగా స్పందించేది పోలీసులేనని, దేశ భద్రతతోపాటు ప్రజల రక్షణగా ఉంటున్న పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 473మంది పోలీసులు అమరులయ్యారని, తెలంగాణలో శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ శివరాత్రి రోజున తన ప్రాణాలు ఫణంగా పెట్టి విద్యుత్ తీగలు భక్తులపై పడకుండా కాపాడి అమరడయ్యాడన్నారు. కొత్త జిల్లాలకు నియామకాల ప్రక్రియ మొదలైందని, త్వరలోనే పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. ప్రజల సౌకర్యార్థం 9 కమిషనరేట్లు, 23 సబ్ డివిజన్లు, 64 సర్కిళ్లు, 92 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, మహిళా భద్రతకు షీ టీం, భరోస కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గాయని, నేరస్థులను పట్టుకోవడం, దర్యాప్తులో సిసి కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. పోలీస్ శాఖ పటిష్టతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని, ఇందుకోసం ఇతోధికంగా నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు.
ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: డిజిపి
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, ప్రజా భద్రతకు పోలీసులు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. ఇప్పటివరకు విధి నిర్వహణలో అమరులైన కానిస్టేబుల్ స్థాయి నుంచి ఆపై ఉన్నతాధికారుల వరకు ప్రభుత్వపరంగా ఎక్స్‌గ్రేషియా అందేదని, ఇప్పుడు అమరులైన హోంగార్డులకు సైతం రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు అనురాగ్ ప్రకటించారు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని, దేశంలో తొలిసారిగా నిర్వహించిన ఇండియన్ ఫస్ట్ పోలీస్ స్మారక పరుగుకు భారీ స్పందన లభించిందన్నారు. కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన సిఎం కెసిఆర్ సందేశాన్ని, అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ గవర్నర్ నరసింహన్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు ప్రోత్సహకాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు డిజిపి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, మాజీ డిజిపిలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం... పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి