తెలంగాణ

24న గిరిజన, బిసి ఉద్యోగుల వర్క్‌షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: గిరిజన, బిసి సంక్షేమ శాఖ చేపట్టే సంక్షేమ పథకాలను వేగంగా, సమర్థంగా గిరిజనులకు, బిసిలకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ శాఖ సిబ్బందిని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఎస్‌టి, బిసి శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు, అసిస్టెంట్ అధికారులు, పరిపాలనాధికారులకు ఈ నెల 24 న డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ ఇస్తున్నారు. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్, బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్నతో పాటు ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు తదితరులు పాల్గొంటారని అధికారిక ప్రకటనలో వివరించారు.