తెలంగాణ

బిసిలకు ప్రాధాన్యం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించటంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుకోరారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు సోమవారం విహెచ్ లేఖ రాశారు. కొత్తగా 21 జిల్లాను ఏర్పాటు చేసిందున ఆ జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించే సమయంలో బలహీన వర్గాలకు దృష్టిలోపెట్టుకుని నియామకాలు చేయాలన్నారు. తెంలగాణలో వెనుకబడిన కులాలు ఎక్కువ కాబట్టి వారికి ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్‌ను పటిష్టం చేయాలని హనుమంతరావు కోరారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించేందుకు కాంగ్రెస్ వార్ రూంలో జరిగిన కీలక సమావేశానికి విహెచ్ హాజరయ్యారు. ప్రియాంక గాంధీ హాజరైన ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ ప్రచార కార్యక్రమంపై చర్చ జరిగింది. కార్యకర్తలను దూరం చేసుకోవటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ప్రియాంక అభిప్రాయపడ్డారు.