తెలంగాణ

మూసుకోనున్న బాబ్లీ గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 27: నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం మూసివేయనున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ గత జూలై 1వ తేదీన బాబ్లీకి చెందిన 14గేట్లను ఎత్తివేసి దిగువకు నీరు వదిలారు. ఈ నెల 29వ తేదీన సిడబ్ల్యుసి ప్రతినిధి సమక్షంలో ఇరు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో బాబ్లీ గేట్లను కిందికి దించి గోదావరి నీటి ప్రవాహాన్ని నిలిపివేస్తారు. వచ్చే ఏడాది 2017 జూన్ 30న మళ్లీ బాబ్లీ గేట్లను తెరుస్తారు. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల మొన్నటి సెప్టెంబర్ లోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి (90టిఎంసిలు) నీటి మట్టాన్ని సంతరించుకోవడం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. ప్రస్తుతం బాబ్లీ గేట్లు మూసివేసినప్పటికీ, తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు వచ్చే నష్టమేమీ ఉండదు. రబీతో పాటు వచ్చే ఖరీఫ్ సీజన్‌కు కూడా వారాబందీ ప్రకారం సాగు జలాలు అందించేందుకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. ఈ ఒక్క రబీ సీజన్‌లోనే 8.50లక్షల పైచిలుకు ఎకరాలకు ఎస్సారెస్పీ ద్వారా నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిజానికి గత రెండేళ్లుగా బాబ్లీ గేట్ల మూసివేతకు సంబంధించి అన్ని వర్గాల వారిలోనూ ఎనలేని ఆందోళన వ్యక్తమైంది. వరుస వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎగువ ప్రాంతంలోనూ నీటి నిల్వలు లేకపోవడంతో బాబ్లీ వద్ద గోదావరి నది పూర్తిగా బోసిపోయి కనిపించింది. దీంతో బాబ్లీ గేట్లు ఎత్తినా, కిందకు దించినా ఇరు రాష్ట్రాలకు ఒనగూరే ప్రయోజనం శూన్యంగానే ఉండిపోయింది. చివరకు గతేడాది జూలైలో జరిగిన గోదావరి మహా పుష్కరాల సమయంలోనూ నీటి లభ్యత తగినంతగా లే ని కారణంగా పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బాబ్లీ వద్ద 0.40టిఎంసిల వరకు నీటి నిల్వలు ఉండడంతో, వాటిని గేట్లు పైకెత్తి దిగువకు విడుదల చేయాలని ప్రభు త్వం అభ్యర్థించినప్పటికీ, వర్షాభావాన్ని దృష్టి లో పెట్టుకుని మహా సర్కార్ సున్నితంగా తిరస్కరించింది. అయితే ఈసారి అలాం టి గడ్డు పరిస్థితులకు తావులేకుండా కుండపోత వర్షాలు కురియడంతో ఎగువన గల మహారాష్టల్రోని విష్ణుపురి, గైక్వా డ్, బాబ్లీ సహా ఇతర బ్యారేజీలన్నీ పూర్తిస్థాయిలో నిండి దిగువకు నీటిని విడుదల చేశారు. భారీగా నీరు విడుదల చేయటంతో సుమారు 120టిఎంసిలకు పైగా జలాలు వృధాగా సముద్రంలోకి విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే అక్టోబర్ మొదటి వారం నుండి వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి వరద నీటి ప్రవాహం నిలిచిపోయింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఈ నెల 29న మహారాష్ట్ర బాబ్లీ గేట్లను మూసివేయనుంది.

చిత్రం.. బాబ్లీ ఎగువన గోదావరిలో నీటి నిల్వలు