తెలంగాణ

ఇక డిజిటల్ తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణలో 1500 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాసురూమ్‌లను ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. డిజిటల్ క్లాసు రూమ్‌ల ప్రారంభానికి తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో కడియం శ్రీహరి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిజిటల్ లిటరసీలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. నవంబర్ 14న 1500 స్కూళ్లలో డిజిటల్ క్లాసు రూమ్‌లను ప్రారంభించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఇందుకు అవసరమైన శిక్షణను నవంబర్ 10లోగా పూర్తి చేయాలని, అలాగే సబ్జెక్టు కంటెంట్‌ను స్కూళ్లకు అందించాలని అన్నారు. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకూ హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టుల్లో ఎస్‌సిఇఆర్‌టి రూపొందించిన సబ్జెక్టు కంటెంట్‌ను విద్యార్ధులకు డిజిటల్ క్లాసు రూమ్ ద్వారా బోధించడం జరుగుతుందని అన్నారు. పాఠశాలల్లో దశల వారీగా డిజిటల్ క్లాసురూంలలో కంప్యూటర్ ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచిస్తోందని అన్నారు. ఎంపిక చేసిన 1500 పాఠశాలల్లో ఆన్‌లైన్, ఆఫ్ లైన్, మన టివి ద్వారా డిజిటల్ తరగతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ అందించడానికి అన్ని జిల్లాల్లో కాలేజీలను గుర్తించామని, దీనికి అనుగుణంగా షెడ్యూలును రూపొందించుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, గిరిజన -వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి బెనహర్ మహేష్ దత్ ఎక్కా, ఐటి శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్ళి ఓమర్ జలీల్, మన టివి సిఇఓ శైలేష్‌రెడ్డి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ కిషన్, రెసిడెన్షియల్ స్కూల్స్ డైరెక్టర్ శేషుకుమారి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ డైరెక్టర్ షఫి ఉల్లా పాల్గొన్నారు.

చిత్రం.. సచివాలయంలో సమీక్ష జరిపిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి