తెలంగాణ

ఆర్నెల్ల ఆదాయం అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ఆదాయ వనరులుగా ఉన్న వివిధ శాఖలు బడ్జెట్ అంచనాలను మించి పురోగతిలో పయనిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్ధ వార్షిక లెక్కల ప్రకారం వచ్చిన రాబడి రాష్ట్ర ఖజానాను పరిపుష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఆదాయానికి తోడు కేంద్రం నుంచి రాబోతున్న నిధులతో ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అభిప్రాయపడ్డారు. సచివాలయంలో శుక్రవారం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో రాజీవ్ శర్మ సమావేశం అయ్యారు.
అర్ధ వార్షికాదాయంపై ఆయన వివిధ శాఖాధిపతులతో సమీక్షించారు. రాష్ట్రంలో నిధుల కొరత లేని పరిస్థితి ఉండటంతో వివిధ పథకాలు, కార్యక్రమాలకు కేటాయించిన నిధులను ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా విడుదల చేయాల్సిందిగా రాజీవ్ శర్మ ఆదేశించారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుల పంట రుణ మాఫీ వాయిదాలకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగకూడదని రాజీవ్ శర్మ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎక్సైజు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, వాణిజ్య పన్నుల ద్వారా అర్ధ సంవత్సరానికి సమకూరిన రాబడిపై శాఖల వారీగా సమీక్షించారు. రాష్ట్ర ఆదాయం బడ్జెట్ అంచనాలకు మించి రావడం శుభప్రదమన్నారు. వీటికి తోడు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల అదనంగా రానున్నట్టు ఆయన వివరించారు. మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలకు రుణ పరిమితి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 1600 కోట్ల రుణం పొందడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి ఇతర రాష్ట్రాలకు వార్షిక బడ్జెట్‌లో 3.25 ఉండగా, ఇది మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలకు 3.50 శాతానికి పెరిగింది. దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన రెండు రాష్ట్రాలో తెలంగాణ, గుజరాత్ మాత్రమే ఉన్నాయి. పెరిగిన ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితి వల్ల అర్ధ వార్షికానికి రూ. 1600 కోట్లు రుణాన్ని పొందడానికి అవకాశం ఏర్పడినట్టు రాజీవ్ శర్మ ఈ సందర్భంగా వివరించినట్టు తెలిసింది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ.450 కోట్లు రానున్నట్టు ఆయన వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్న రియాల్టీల మొత్తంలో రూ.3,050 కోట్లతో రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 4 వేల కోట్లు సమకూరనుండటంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఇక నుంచి నిధుల కొరత ఉండదని రాజీవ్‌శర్మ వెల్లడించినట్టు అధికార వర్గాల సమాచారం.