తెలంగాణ

తెలంగాణ-బ్రిటన్ మధ్య సాంస్కృతిక బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్రం-బ్రిటన్ దేశాల మధ్య పారిశ్రామిక, సాంస్కృతిక రంగాల్లో పటిష్టమైన సంబంధాలను నెలకొల్పుకుందామని బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు వీరేంద్రశర్మను ప్రభుత్వ సలహాదారు (సాంస్కృతిక వ్యవహారాలు) డాక్టర్ కెవి రమణాచారి కోరారు. వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, కార్యక్రమాలను పరిశీలించేందుకు వీరేంద్రశర్మ వచ్చారు. ఈ సందర్భంగా సచివాలయంలో రమణాచారిని కలిసి వివిధ అంశాలపై వీరేంద్రశర్మ చర్చించారు. తెలంగాణ రాష్ట్రంతో సంబంధాలు పెంచుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆసక్తితో ఉందన్నారు. ఈ అంశంపై మంత్రులు, ముఖ్యమంత్రితో కూడా చర్చిస్తానని తెలిపారు. వారంరోజుల పాటు తాను తెలంగాణలో పర్యటిస్తానని వివరించారు. పారిశ్రామిక, సాంస్కృతిక రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉందని రమణాచారి తెలిపారు.