తెలంగాణ

స్కైప్ టెక్నాలజీని వాడడం సక్రమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: విడాకుల కేసుకు సంబంధించిన పిటిషన్ విచారణలో స్కైప్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు హైదరాబాద్ హైకోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తన భర్త సాక్ష్యాన్ని స్కైప్ టెక్నాలజీ ద్వారా స్వీకరించడానికి కొత్తగూడెం సీనియర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారని, ఈ ఆదేశాలను సవరించి సరిదిద్దాలని కోరుతూ ఒక మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈపిటిషన్‌ను జస్టిస్ శివశంకరరావు విచారించారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సురక్షితమైన పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరాన్నిబట్టి వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జాప్యం కాకుండా నిరోధించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తప్పేమీ లేదని కోర్టు పేర్కొంది. తన భర్త అమెరికాలో ఉన్నారని, కోర్టులో విడాకుల కేసు విచారణకు అత్యవసర పనుల వల్ల హాజరు కాలేనని చెప్పడంతో కొత్తగూడెం కోర్టు డాక్యుమెంట్లను, సాక్ష్యాన్ని స్కైప్ టెక్నాలజీ ద్వారా స్వీకరించేందుకు అనుమతించారని ఒక మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.