తెలంగాణ

గ్రూప్-2 నిర్వహణకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 నిర్వహణకు పబ్లిక్ సర్వీసు కమిషన్ భారీ ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వారి పరీక్ష కేంద్రాల జిపిఎస్ సమాచారాన్ని కూడా అందించింది. అభ్యర్థులు ముందు రోజు తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాలకు వెళ్లి వాటిని గుర్తించి పరీక్ష సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. గ్రూప్-2 పరీక్ష ఈ నెల 11న, 13న జరగనుంది. పరీక్ష సందర్భంగా చేయాల్సిన భారీ ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించిన కమిషన్ పెద్దలు ప్రతి రీజనల్ సెంటర్‌కు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించారు. పరీక్షకు 7.83 లక్షల మంది దరఖాస్తు చేయగా, వారికోసం 1916 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే బుధవారం రాత్రి వరకూ 6.32 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు. అభ్యర్ధులకు ఎలాంటి అనుమానాలున్నా 040-24655555, 040-24696666, 7288896611 నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని కమిషన్ అధికారులు పేర్కొన్నారు. పరీక్ష సందర్భంగా అభ్యర్ధులు చేయదగిన, చేయకూడని అంశాలను ఇప్పటికే సమాచారం ఇచ్చామని చెప్పారు. పరీక్ష హాలులోకి ఉదయం 9.45 వరకూ, మధ్యాహ్నం 2.15 గంటల వరకూ అనుమతిస్తామని, తర్వాత అభ్యర్థులను అనుమతించేది లేదని వివరించారు.