తెలంగాణ

టోల్ టాక్స్ రద్దుతో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 9: కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేయడం రోజువారీ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఇటు ప్రజల వద్ద, అటు నిత్యావసర సరుకుల వ్యాపారుల వద్ద, పెట్రోల్ బంక్‌లు, టోల్‌ప్లాజా నిర్వాహకుల వద్ద చిల్లర లేకపోవడం గందరగోళానికి, గొడవలకు దారితీసింది. మంగళవారం అర్ధరాత్రి పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపాడు టోల్‌ప్లాజాల వద్ద, వరంగల్-హైదరాబాద్ 163 జాతీయ రహదారిపై బీబీనగర్ వద్ద ఉన్న టోల్‌ప్లాజాల వద్ద వాహనాదారులకు, టోల్‌ప్లాజా సిబ్బందికి మధ్య రోజంతా వాగ్వాద దృశ్యాలు కొనసాగాయి. వాహనదారుల నుండి 500, 1000 నోట్లను తీసుకోవడానికి టోల్ సిబ్బంది నిరాకరించడంతో వాగ్వాదం నెలకొంది. చిల్లర లేదన్న సాకుతో పెద్ద నోట్లను తీసుకోవడం లేదంటూ వాహనదారులు ఆరోపించారు. ఈ వివాదాలతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం అందుకున్న నల్లగొండ ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి హుటాహుటిన పంతంగి టోల్ ప్లాజాకు చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి 500, 1000 నోట్లను తీసుకునేలా ఒప్పించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కొర్లపాడు, బీబీనగర్ టోల్‌ప్లాజాల వద్ద, నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద, మిర్యాలగూడ-కోదాడ చిల్లపల్లి మూసీ వంతెన టోల్‌ప్లాజా వద్ద ఈ రకమైన గొడవలు రేగి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసుల జోక్యంతో టోల్‌ప్లాజా నిర్వాహకులు పెద్ద నోట్లను తీసుకోవడంతో సమస్య పరిష్కారమైంది. అయితే టోల్‌ప్లాజాల వద్ద వివాదాల తీవ్రతను గమనించిన కేంద్రం బుధవారం సాయంత్రంకల్లా టోల్ ట్యాక్స్‌లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో టోల్‌ప్లాజాల వద్ద వివాదాలకు తెరపడింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు టోల్‌ట్యాక్స్‌లను రద్దు చేయడంతో వాహనాదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై 500, 1000 నోట్లను
తీసుకోకపోవడంతో నెలకొన్న వివాదంతో ఆగిన వాహనాలు