తెలంగాణ

కోటి ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ/పెద్దవూర, నవంబర్ 9: రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పూల్యాతండా సమీపంలో ఎస్‌ఎల్‌బిసిలో భాగమైన వరదకాల్వ లిఫ్టుకాల్వకు నీటి విడుదలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఉద్యమాలతో సాధించిన తెలంగాణలో రైతులకు పెద్దపీట వేస్తూ దశలవారీగా ప్రాజెక్టు పనులను పూర్తిచేస్తున్నామని తెలిపారు. రాష్డ్ర బడ్జెట్‌లో ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు కేటాయించామని ఆయన అన్నారు. కృష్ణ, గోదావరి నీళ్లతో తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు ప్రాజెక్టులను పూర్తిచేసి నీరందించామని, వేములవాడ లిఫ్టుతో లక్ష ఎకరాలకు నీరందించామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డిండి ప్రాజెక్టుకు టెండర్లను పిలిచామని త్వరలో పూర్తిచేసి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. దీంతో ఫ్లోరైడ్ రహిత నీటిని ప్రజలకు అందించవచ్చన్నారు. ఎల్‌ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గాన్ని ఎన్ని అడ్డంకులు ఎదుర్కొనైనా పూర్తిచేస్తామని దీంతోపాటు మూసి బునాదిగానికాలువ పనులు, ఎస్‌ఆర్‌ఎస్‌పి ఫేజ్-2 పనులు పూర్తయితే తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలతోపాటు కోదాడలోని చిట్టచివరి భూములకు కూడా నీరు అందుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రెండున్నర ఏళ్లలో లిఫ్టులను, ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరందించామని, దీనిలో భాగంగానే వరదకాల్వ లోలెవెల్ కాల్వను ప్రారంభించి జిల్లాలోని పెద్దవూర, అనుముల, నిడమనూరు, తిప్పర్తి, వేములపల్లి, మాడ్గులపల్లి మండలాలకు 84 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నామని ఆయన తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. నాణ్యమైన విద్యుత్, ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు మూడు విడతల్లో రైతుల రుణమాఫీ చేశామని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్‌కుమార్, నేతి విద్యాసాగర్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నేనావత్ బా లునాయక్, నాయకులు నరేందర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రామ్మూర్తియాదవ్ పాల్గొన్నారు.

ఎఎమ్మార్పీ లోలెవెల్ కెనాల్ ప్రారంభించడంతో కాల్వలో వెళ్తున్న కృష్ణాజలాలు, సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు