తెలంగాణ

రాతపరీక్షలో నెగ్గి.. ‘పరుగు’లో ఓడి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, నవంబర్ 9: ఎస్‌ఐ కావాలన్న పట్టుదలతో ఓ యువకుడు రాత పరీక్షలో నెగ్గి, ఈవెంట్స్ అన్నింటిలో ప్రతిభ కనబర్చి 800 మీటర్ల పరుగులో క్వాలిఫై కాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై బల వన్మరణం పాలైన దుర్ఘటన హవేళీఘణాపూర్ మండలం వాడిలో బుధవారం చోటుచేసుకుంది. వాడి గ్రామానికి చెందిన ఇమ్మడి నర్సింలు, వెంకమ్మలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు శ్రీశైలం (27) ఎస్‌ఐ ఉద్యోగం కోసం శాయశక్తులా ప్రయత్నించాడు. రాత పరీక్షలో నెగ్గాడు. ఈవెంట్స్‌లో కూడా కడదాకా చేరుకుని, చివరకు 800 మీటర్ల పరుగును నిర్దేశిత సమయంలో చేరుకోక విఫలమయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పాయసంలో పురుగుల మందు కలుపుకొని సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో గమనించిన కుటుంబీకులు కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు కావడంతో చికిత్సకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించగా డబ్బులు లేక చేయించుకోలేకపోయాడు. సాధారణ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో బుధవారం మృతిచెందినట్లు గ్రామసర్పంచ్ తౌర్య తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.