తెలంగాణ

బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 10 : రాష్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని ప్రకటించి...ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎల్‌పి నేత డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రెండున్నరేళ్లలో 2500 అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 1.30 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టె తెలంగాణ సర్కార్ అన్నదాతల రుణమాఫీ కోసం కేవలం 8 వేల కోట్లు కేటాయించలేరా? అని డాక్టర్ లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ సర్కార్ రైతుల రుణమాఫీకి నిధులు కేటాయించకపోవడంతో అన్నదాతల మీద ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, రుణమాఫీ, కేంద్రం మంజూరు చేసిన కరువుభత్యం నిధులు విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా కేంద్రం నుండి శ్రీకారం చుట్టిన రైతు పోరుయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. కల్తీ విత్తనాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతే సర్కార్ కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తోందన్నారు. తెలంగాణ రైతాంగం అతివృష్టి, అనావృష్టితో తీవ్రంగా నష్టపోయారని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 791 కోట్ల నిధులు అన్నదాతలకు ఆందచేయడంతో సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నాబార్డు పథకం కింద 7 వేల కోట్లు నిధులు కేటాయిస్తే ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు, నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట నిధులు దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. సాగుచేసిన పంటలకు మార్కెట్‌యార్డులో రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించలేదన్నారు. మార్కెట్ యార్డులో దళారుల రైతులను నిలువునా దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో మార్కెట్‌లో తాను సందర్శించినప్పుడు ఏన్నో సమస్యలతో తీవ్ర ఇబ్బందుల పడుతున్న విషయాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు. యార్డులో పనిచేసే కూలీలకు సైతం సరైన వౌలిక సదుపాయాలు లేవని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కరించేందుకు బిజెపి చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారంతో వారికి అండగా ఉండి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టి వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి, అధికార ప్రతినిధి సుభాష్, రాష్ట్ర నేతలు రాంచంద్రారెడ్డి, రాంచందర్‌రావు, విద్యాసాగర్, బిజెవివైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, కౌన్సిలర్ బాసంగారి వెంకట్, కమలకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్