తెలంగాణ

నా ఆస్తి పదివేలే! సిఎం కెసిఆర్ చమత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ సంపన్న రాష్ట్రం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తి ఇదిగో అంటూ సిఎం కెసిఆర్ జేబులోని పదివేలు తీసి చూపించారు. ఉన్నతాధికారులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించిన సందర్భంలో జేబులోని పదివేలు తీసి చూపిస్తూ చమత్కరించారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన సొమ్ము బ్యాంకులో ఉంది. మేనేజర్‌కు ఫోన్ చేసి పరిస్థితి ఏమిటి? అని అడిగితే పది వేల వరకూ ఇస్తామన్నారు. చెక్కు పంపితే, పదివేలిచ్చారు. ఇప్పటికిదే పదివేలు అంటూ చమత్కరించారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తి పదివేలేనంటూ జేబులోని రెండు వేల రూపాయల నోట్లు ఐదు తీసి చూపించారు. పైగా ఈ పది వేలకు చిల్లర దొరికే పరిస్థితి లేదని చమత్కరించారు. సిఎం పరిస్థితే ఇలావుంటే, పెద్ద నోటు దెబ్బ రాష్ట్ర ప్రజలపై ఇంకెంత బలంగా ఉందోనని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు, అమ్మకాలు లేక వ్యాపారాలు మొత్తం నిలిచిపోయాయన్నారు. హిమాయత్‌నగర్‌లోని మినర్వా హోటల్‌కు వెళ్లడం తనకు అలవాటని, అక్కడ ఎప్పుడూ పెద్ద సంఖ్యలో ఉండే జనం కనిపించక ఖాళీగా ఉందని ఒక సీనియర్ సెక్రటరీ సిఎంకు తన అనుభవాన్ని వివరించారు. రోడ్లపై ట్రాఫిక్ సైతం తగ్గిపోయిందని, బట్టల షాపులు, ఎలక్ట్రానిక్ షాపుల్లో జనమే కనిపించడం లేదని అధికారులు వివరించారు. రెండు నెలల్లో పరిస్థితి మెరుగవుతుందని ప్రధాని మోదీ చెబుతున్నా, ఆర్థిక పరిస్థితి తిరిగి పుంజుకోవడం ఇప్పట్లో సాధ్యంకాదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.