తెలంగాణ

పురాతన బావి పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: హైదరాబాద్ నగర శివారులోని వౌలాలిలో గల చారిత్రక ‘స్టెప్‌వెల్’ బావిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. సుమారు 150 ఏళ్లనాటి పురాతన బావి రైల్ ఇంజన్లకు నీరు నింపేదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆదివారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా, దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శిఖ గుప్తా ‘స్టెప్‌వెల్’ను ప్రారంభించారు. ఈ బావి ద్వారా రోజుకు 1.5 లక్షల లీటర్ల నీరు సరఫరా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ నీటిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, ఆర్మీ క్యాంప్ వినియోగించుకోనుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

చిత్రం.. దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించిన 150 ఏళ్లనాటి పురాతన బావి